పెరుగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2021-06-22T04:57:11+05:30 IST

గోదావరి పరీవాహక ప్రాంతం స్థానికులను భయపెడుతోంది.

పెరుగుతున్న గోదావరి
రుద్రమకోట, కూనవరం మధ్య గోదావరి ఉధృతి

వేలేరుపాడు, జూన్‌ 21: గోదావరి పరీవాహక ప్రాంతం స్థానికులను భయపెడుతోంది. సాధారణంగా మే, జూన్‌లో గోదావరి నదిలో మోకాలి లోతు నీరు కూడా ఉండదు. కానీ నెల రోజులుగా గోదావరి నిండుకుండను తలపిస్తోంది. భద్రాచలం వద్ద 35, 40 అడుగుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితి కనిపించేది. భద్రాచలం వద్ద 8 అడుగుల నీటి మట్టం ఉన్న సమయంలో తూర్పు, పశ్చిమ గట్లను తాకుతున్న ప్రవాహంతో గిరిజనం, ముంపు ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు కొంత నీరు చేరుతోంది. కాఫర్‌ డ్యామ్‌ మూసివేతతో నదీ ప్రవాహం వెనక్క మరలడంతో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. ఎగువన అధిక వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని ముంపు మండలాల ప్రజలు భయపడుతున్నారు.

Updated Date - 2021-06-22T04:57:11+05:30 IST