Dhavaleswaram దగ్గర Godavari వరద ఉధృతి.. నీట మునిగిన Lanka villages..

ABN , First Publish Date - 2022-07-14T18:16:19+05:30 IST

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 15.30 అడుగులకు పెరిగింది.

Dhavaleswaram దగ్గర Godavari వరద ఉధృతి.. నీట మునిగిన Lanka villages..

అమరావతి (Amaravathi): ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ (Dhavaleshwaram Cotton Barrage) వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 15.30 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి 15.40 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లంక గ్రామాలు (Lanka villages) నీట మునిగాయి. రెండు రోజులుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. గురువారం సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో జలవనరులశాఖ అధికారులు రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశారు.


కోనసీమకు సంబంధించి 18 మండలాల్లో 51 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అరిగిలవారిపేట, ఉడిమూడి లంక.. నాలుగు లంక గ్రామాలు నీట మునిగాయి. ఏ ప్రాంతంలో చూసినా వరద ఉధృతి కనిపిస్తోంది. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లంక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-14T18:16:19+05:30 IST