బూరుగుపూడి ఆవ భూముల్లో గోదావరి వరదనీరు

ABN , First Publish Date - 2021-07-26T05:29:04+05:30 IST

నవరత్నాల పేరిట పేదలకు ఇళ్ల స్థలాల కోసం బూరుగుపూడి అయ్యన్నగళ్లు ప్రాంతంలో ప్రభుత్వం సేకరించిన ఆవ భూము ల్లోకి ఆదివారం గోదావరి వరదనీరు వచ్చి చేరింది.

బూరుగుపూడి ఆవ భూముల్లో గోదావరి వరదనీరు
బూరుగుపూడి ఆవభూముల్లోకి చేరిన గోదావరి వరద నీరు

  • ఆరడుగుల మేర చేరిన నీరు 
  • ఈ భూముల్లోనే 40వేల మందికి ఇళ్ల స్థలాల కేటాయింపు

కోరుకొండ, జూలై 25: నవరత్నాల పేరిట పేదలకు ఇళ్ల స్థలాల కోసం బూరుగుపూడి అయ్యన్నగళ్లు ప్రాంతంలో ప్రభుత్వం సేకరించిన ఆవ భూము ల్లోకి ఆదివారం గోదావరి వరదనీరు వచ్చి చేరింది. 12 నెలల కాలంలో సుమా రు 6నెలల పాటు ఈ ఆవభూములకు గోదావరి వరద ముంపు తప్పదు. గత సంవత్సరం ప్రభుత్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన సుమారు 40వేల మందికి ఇక్కడ ఇళ్ల్ల స్థలాలు ఇవ్వడం కోసం వందల కోట్లు వెచ్చించి ఆవభూములను సేకరించింది. అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించడం కోసం మట్టి రోడ్లను కూడా ఏర్పాటు చేసింది. ఇవి ఇళ్ల స్థలాలకు పనికిరావని, సంవత్సరంలో ఆరునెలలపాటు ఆరు అడుగుల వరదనీటిలో మునిగిపోతాయని అన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శిం చాయి. అంతేకాకుండా ఈ ఆవభూములను ఆరు అడుగుల మేర మెరక చేస్తే చుట్టు పక్కల గ్రామాలైన బూరుగుపూడి, జంబుపట్నం, కాపవరం, మునగాల, బుచ్చింపేట గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆయా గ్రామ ప్రజలు ప్రభుత్వానికి అనేక సార్లు మొర పెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం వినిపించు కోకపోవడంతో బూరుగుపూడికి చెందిన అఖిల పక్ష రైతు నాయకుడు అడపా శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ఆగి పోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు పెరిగి మరోసారి ఆయ్యన్న గళ్ల ఆవభూముల్లో సుమారు 6 అడుగుల లోతున వరదనీరు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-07-26T05:29:04+05:30 IST