గోదావరికి మళ్లీ వరద

ABN , First Publish Date - 2021-07-23T07:36:05+05:30 IST

గోదావరికి మళ్లీ వరద తగిలింది. ఇటీవల వచ్చినట్టే వచ్చి తగ్గుముఖం పట్టింది. కానీ భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం నుంచి వరద పెరుగుతోంది. అధికారుల అంచనా ప్రకారం మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినట్టు చెప్తున్నారు. ఈ ప్రభావం వల్ల ఇక్కడ ప్రభావం ఉండవచ్చు.

గోదావరికి మళ్లీ వరద
రాజమహేంద్రవరంలో ఎరుపెక్కిన గోదావరి నీరు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరికి  మళ్లీ వరద తగిలింది. ఇటీవల వచ్చినట్టే వచ్చి తగ్గుముఖం పట్టింది. కానీ భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం నుంచి వరద పెరుగుతోంది. అధికారుల అంచనా ప్రకారం మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినట్టు చెప్తున్నారు. ఈ ప్రభావం వల్ల ఇక్కడ ప్రభావం ఉండవచ్చు. దాంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముసురు వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం వల్ల కూడా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగుతాయి. దీంతో జిల్లాలో పల్లపు ప్రాంతాల్లో కూడా నీరు నిలిచిపోయింది. రోడ్లు బాగా పాడడవ్వంతో అసలు ఎవరూ రోడ్లమీద తిరగలేని పరిస్థితి. అధ్వానంగా తయారయ్యాయి. ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్నట్టు చెప్తున్న అనేక కాలనీ లే-అవుట్లు మునిగిపోయాయి. ఇంకా కొద్దిరోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఈ నెల 16న భద్రాచలం వద్ద 16.40 అడుగుల వరకు నీటిమట్టం వచ్చింది. అప్పుడు పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వద్ద 28.2 మీటర్ల నీటి మట్టం నమోదైంది. దాంతో దేవీపట్నంతో పాటు అనేక గ్రామాలు మునిగిపోయాయి. అప్పుడు పోలవరం స్పిల్‌వే నుంచి లక్షా 10వేల క్యూసెక్కుల వరద నీటిని ధవళేశ్వరం బ్యారేజీ  వైపు వదిలేశారు. బ్యారేజీ నుంచి లక్షా 51వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలేశారు. కానీ తర్వాత వరద క్రమంగా తగ్గింది. భద్రాచలం వద్ద 12అడుగుల నీటి మట్టం తగ్గింది. ఇవాళ మళ్లీ భద్రాచలం వద్ద నీటిమట్టం పెరిగి 16.30 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి  53,063 క్యూసెక్కుల సముద్రంలోకి వదులుతున్నారు. డెల్టా కాల్వలకు 5.500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గోదావరి నీరంతా ఎర్రగా మారింది. కొండల ప్రాంతంలోను, ఎర్ర నేల ప్రాంతంలోను బాగా వర్షాలు కురడం వల్ల ఎర్ర నీరు వస్తోంది.

Updated Date - 2021-07-23T07:36:05+05:30 IST