గోదారి గలగల

ABN , First Publish Date - 2022-01-29T06:58:56+05:30 IST

గోదావరి జలకళతో తొణికిసలాడుతోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు కలిసొచ్చాయి. దాంతో ఇన్‌ఫ్లోస్‌ తగిలాయి. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం పెరగడంతో స్పిల్‌వే నుంచి కిందకు నీటిని వదిలేస్తున్నారు.

గోదారి గలగల
బ్యారేజీ వద్ద సముద్రంలోకి వదిలిన మిగులు జలాలు

  • కలిసొచ్చిన వానలు
  • సముద్రంలోకి 2,786 క్యూసెక్కులు
  • ప్రస్తుతం రబీకి ఇబ్బంది లేనట్టే

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరి జలకళతో తొణికిసలాడుతోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు కలిసొచ్చాయి. దాంతో ఇన్‌ఫ్లోస్‌ తగిలాయి. పోలవరం ఎగువ  కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం పెరగడంతో స్పిల్‌వే నుంచి కిందకు నీటిని వదిలేస్తున్నారు. దీంతో రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాంతంలో గతంలో తేలిన ఇసుక తిప్పలు మునిగిపోయాయి. ధవళే శ్వరం బ్యారేజీ వద్ద కొద్దిరోజుల కిందట ఆరు అడుగుల వరకూ పడి పోయిన నీటిమట్టం ఇప్పుడు 10.90 అడుగులకు పెరిగింది. దీంతో కాటన్‌ బ్యారేజీ మూడు గేట్లు ఎత్తివేశారు. ధవళేశ్వరం వైపు రెండు గేట్లు, మద్దూరు వైపు ఒక గేటు ఎత్తి సముద్రంలోకి 2,786 క్యూసె క్కుల నీటిని వదిలేస్తున్నారు. కాలువలకు కూడా నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈస్ట్రన్‌ డెల్టా కాలువ (కాకినాడ వైపు) 3,300 క్యూసెక్కులు, సెంట్రల్‌ డెల్టా (కోనసీమ)కు 2,100 క్యూసెక్కు లు, వెస్ట్రన్‌ డెల్టా (పశ్చిమగోదావరి)కి 4000 క్యూసెక్కులు వదిలేస్తు న్నారు. పోలవరం స్పిల్‌వే నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 26.6 మీటర్లుగా ఉంది. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో కురిసిన వానల వల్ల ఇన్‌ఫ్లోస్‌ బాగా వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. పుష్కర తదితర ఘాట్లన్నీ గతంలో ఎండిపోగా ఇవాళ నీటితో కళకళలాడుతన్నాయి. రబీ వరి సాగుకు నీరు సరిపడక గిజగిజలాడుతున్న సమయమిది. కొన్ని ప్రాం తాల్లో వరి చేలు బీటలు వారాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం డ్రైనేజీలకు అడ్డుకట్టలు, వంతులవారీ విధానం  వంటి చర్యలు మొదలెట్టింది. ఈనెల 25వ తేదీ నుంచి వంతులవారీ విధానం అమలుచేయాలని నిర్ణయించింది. ఓ ప్రత్యేకాధికారిని కూడా నియమించింది. ఈలోగా ఎగువ భాగంలో అకాలవర్షాలతో కాలం కలిసొచ్చింది. గోదావరిలోకి ఇన్‌ఫ్లోస్‌ పెరిగాయి. దీంతో అఽధికార యం త్రాంగం వంతుల వారీ విధానాన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం కాలు వలకు నీరు వదలడంతోపాటు బ్యారేజీ వద్ద మిగిలిన నీటిని సము ద్రంలోకి వదిలేస్తున్నారు. ఇలా రబీ పూర్తయ్యేవరకూ నీరుంటే ఇబ్బం ది లేదు. కానీ ప్రస్తుతానికి రబీకి నీటిఎద్దడి లేదని, తర్వాత పరిస్థితి ఇంకా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో కురిసిన అకాలవర్షం వల్ల వరికి పురుగు పడుతోందనే ఆందోళన మొదలైంది.

Updated Date - 2022-01-29T06:58:56+05:30 IST