గోదావరి తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-08-16T07:29:42+05:30 IST

ధవళేశ్వరం, ఆగస్టు 15: ధవళేశ్వరం వద్ద గత నాలుగు రోజులుగా నిలకడగా కొనసాగిన గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రానికి 14.80 అడుగులుగా ఉన్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 14.30 అడుగులకు చేరుకుంది. ఎగువన వచ్చి చేరుతు

గోదావరి తగ్గుముఖం
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి

13 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి 

 ప్రాణహిత, ఇంద్రావతి ఉధృతం

ధవళేశ్వరం, ఆగస్టు 15: ధవళేశ్వరం వద్ద గత నాలుగు రోజులుగా నిలకడగా కొనసాగిన గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రానికి 14.80 అడుగులుగా ఉన్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 14.30 అడుగులకు చేరుకుంది. ఎగువన వచ్చి చేరుతు న్న కొద్దిపాటి ప్రవాహంతోపాటు పరీవాహకంలో పలుచోట్ల వర్షం వల్ల వాగులు, వంకల నుంచి నీరు వచ్చి చేరుతుండడంతో గోదావరి తగ్గుదల నెమ్మదించినా నిలకడగా కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో 3 పాయింట్ల మేర మాత్రమే తగ్గిన నీటిమట్టం సోమవారం అర అడుగుమేర తగ్గింది. ఇదిలా ఉండగా ఎగువన భద్రాచలం వద్ద మూడు రోజులపాటు నిలకడగా ఉన్న నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. సోమవారం తెల్లవారుజామున నీటిమట్టం 47.80 అడుగులకు  తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహకరించారు. ఆపై వేగంగా తగ్గిన నీటిమట్టం సాయంత్రానికి 46.30 అడుగులుగా నమోదైంది. అయితే ఉప నదులు ఇంద్రావతి, ప్రాణహిత , శబరి పరీవాహకాల్లో విస్తారంగా కురిసిన వర్షాల వల్ల పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో గోదావరి మళ్లీ పెరగనుంది.  


కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో.. అదే ఉధృతి 

కొవ్వూరు, ఆగస్టు 15 : గత కొన్ని రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తున్న అఖండ గోదావరి శాం తించింది. ఎగువున కురుస్తున్న వర్షాలతో గత మూడు రోజులుగా గోష్పాదక్షేత్రాన్ని వరద ముం చెత్తింది. వరద తగ్గుముఖం పట్టడంతో జలదిగ్బంధంలో ఉన్న క్షేత్రం తేరుకుంది. వరద ప్రవా హం తగ్గుముఖం పట్టడంతో ఆలయాల్లో చేరిన వరద, క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాల వద్దకు వెనక్కు మళ్లింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాల మెట్లన్నీ ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. కొవ్వూరు వద్ద అఖండ గోదావరి సుడు లు తిరుగుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వరద తగ్గి గోష్పాదక్షేత్రంలో మాత్రం బురద మిగిలింది. ఆలయాల్లో చేరిన బురదను సిబ్బంది శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.

Updated Date - 2022-08-16T07:29:42+05:30 IST