హైదరాబాద్ వాసికి ‘గోదావరి నంది’ పురస్కారం

ABN , First Publish Date - 2021-02-28T01:52:31+05:30 IST

నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఆలేటి శ్రీనివాస్ రావును ‘గోదావరి నంది’ పురస్కారం వరించింది. కరోనా సమయంలో ఆయన రాసిన

హైదరాబాద్ వాసికి ‘గోదావరి నంది’ పురస్కారం

రాజమహేంద్రవరం: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఆలేటి శ్రీనివాస్ రావును ‘గోదావరి నంది’ పురస్కారం వరించింది. కరోనా సమయంలో ఆయన రాసిన ‘రాయబడని మరణాలెన్నో’ పాటకు గానూ ఈ అవార్డును అందించారు. రాజమహేంద్రవరంలోని హైటెక్ బస్ స్టాండ్‌లో వై జంక్షన్ వద్దనున్న రోటరీ హాల్‌లో పురస్కారాలు అందించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ వంగపండు ఉష చేతుల మీదుగా శ్రీనివాసరావు ఈ అవార్డు అందుకున్నారు. జాతీయ స్థాయిలో మాతృభాషా, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా భాషా, సాహిత్య, సామాజిక కళా రంగాల్లో కృషి చేస్తున్న వారికి ఈ అవార్డులు అందిస్తున్నారు. 

Updated Date - 2021-02-28T01:52:31+05:30 IST