బిరా బిరా గోదారి....

ABN , First Publish Date - 2021-07-17T05:34:43+05:30 IST

గోదావరి ఉరకలేస్తోంది.. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చే రుతోంది. దీంతో గోదావరిపై నిర్మించిన బ్యారేజీల గేట్లుఎ త్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం బ్యారేజీ నుంచి 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని ది గువకు వదిలారు.

బిరా బిరా గోదారి....
నిండుకుండలా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ అన్నారం బ్యారేజీ నుంచి దిగువకు వెళ్తున్న నీరు

కాళేశ్వరం వద్ద జీవనది ఉగ్రరూపం
మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి నీరు
అన్నారం, మేడిగడ్డ, తుపాకులగూడెం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
తుపాకులగూడెం బ్యారేజీ నుంచి 1.30 లక్షల క్యూసెక్కులు దిగువకు..


ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి
గోదావరి ఉరకలేస్తోంది.. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చే రుతోంది. దీంతో గోదావరిపై నిర్మించిన బ్యారేజీల గేట్లుఎ త్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం బ్యారేజీ నుంచి 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని ది గువకు వదిలారు. మరోవైపు కన్నెపల్లి, దేవాదుల పంపుహౌ్‌సల నుంచి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. మరో రెం డు, మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేస్తున్నారు.

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి 6.53 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నది నుంచి ఇక్కడ గోదావరిలో 64 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. మానేరు నది నుంచి 5,100 క్యూ సెక్కుల వరదనీరు అన్నారం వద్ద గోదావరిలోకి చేరుతోంది. పలిమెల మండలం దమ్మూరు వద్ద గోదావరిలో కలిసే ఇంద్రావతి నుంచి కూడా భారీగా వరద వస్తోంది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో క లుస్తున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణహిత, ఇంద్రావతి, మానేరులతో పాటు ఇతర వాగులు, వంకల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో గోదావరి ఉరకలు వేస్తోంది. దీంతో కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద 1.30 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తుతోంది.

గేట్లు ఎత్తి దిగువకు నీరు..

గోదావరిలోకి భారీగా వరదనీరు వస్తోండడంతో అధికారులు కీలకమైన బ్యారేజీ గేట్లు ఎత్తి వేశారు. భూపాలపల్లి జిల్లా అన్నారం బ్యారేజీలోకి ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రా జెక్టు, మానేరు నుంచి భారీగా వరద వస్తోంది. అన్నారం బ్యారేజీలో 10.17 టీఎంసీలకుగాను ప్రస్తుతం 7.48 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఐదు గేట్లను ఎత్తి దిగువకు 2,250 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 16.17టీఎంసీల సామర్థ్యం ఉండగా,  ప్రస్తుతం 9.16 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇక్కడ 24 గేట్లు ఎత్తి 41,670 క్యూసెక్కుల నీటిని బయటకు పంపిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజీ కీలకమైనది. ఈ వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజీలోకి వచ్చిన ప్రాణహిత నది వరద నీటిని జూన్‌ 16 నుంచి జూలై 7వ తేదీ వరకు 29.30 టీఎంసీలను ఎగువకు ఎత్తిపోశారు. వర్షాలు భారీగా పడుతుండటంతో గతవారం నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి ఎత్తిపోతలను నిలిపివేశారు. దీంతో గోదావరిలోకి వచ్చిన వరదను మొత్తం మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్లు ఎత్తి దిగువకు పంపిస్తున్నారు. కాగా, తుపాకులగూడెం బ్యారేజీ 6.94 టీఎంసీలు సామర్థ్యం కాగా, పూర్తిగా నిండటంతో 59గేట్లు ఎత్తివేసి పైనుంచి వస్తున్న 1.30లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు.

అన్నారం బ్యారేజీ నుంచి తుపాకులగగూడెం బ్యారేజీ వరకు ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు నదులతో పాటు ఇతర వాగుల నుంచి వస్తున్న వరద గోదావరిలోకి చేరుతుండటంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. అయితే తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణంతో ఏటూరునాగారం వద్ద గోదావరి జలాల పరుగులకు కొంత బ్రేక్‌ పడుతుంది. దీంతో ఈ జూలై నెలలో ఏటూరునాగారం ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పరుగులు పెట్టాల్సిన గోదావరి ప్రవాహానికి చెక్‌ పడింది. దీంతో ఏటూరునాగానం వద్ద గోదావరి ఒక పాయగా దర్శనమిపస్తోంది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండటంతో పాటు తుపాకులగూడెం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

లోతట్టు ప్రాంతాల అలర్ట్‌..

రానున్న మరో రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణశాఖ పే ర్కొంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల ను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్‌ మండలాలు, ము లుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని అనేక గ్రామాలు గోదావరి ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏ టూరునాగారం వద్ద గోదావరి ప్రవాహం పెద్దగా లేకపోయినప్పటికి పైనఉన్న ప్రాజెక్టు గేట్లు మొత్తం ఎత్తివేస్తోండటంతో ప్రమాదం ఎప్పుడైనా ముంచుకరావచ్చునని అధికారులు అప్రమత్తం అవుతున్నారు. అ న్నారం బ్యారేజీ నుంచి తుపాకులగూడెం బ్యారేజీ వ రకు గోదావరిలో వరద భారీగా పెరుగుతోంది.



Updated Date - 2021-07-17T05:34:43+05:30 IST