అందుకే నెగెటివ్‌ రోల్‌ చేశాను

Published: Sat, 25 Jun 2022 01:33:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అందుకే నెగెటివ్‌ రోల్‌ చేశాను

సత్యదేవ్‌ కథానాయకుడిగా నటి ంచిన ‘గాడ్సే’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు ప్రకాష్‌ నాగ్‌. ఆ చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ను పోషించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా తనకు దక్కిన గుర్తింపు గురించి మాట్లాడుతూ ‘‘దర్శకుడు గోపీ గారికి నా వర్కింగ్‌ స్టైల్‌ నచ్చి పిలిచి ‘గాడ్సే’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. మొదటి చిత్రంలోనే ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం నాకు కలిసొచ్చింది. ఇందులో నా పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. ఒక సామాజిక సమస్యపై ఆలోచన రేకెత్తించే ‘గాడ్సే’ లాంటి చిత్రంలో నటించడం సంతృప్తిగా ఉంది. నటనకు ఆస్కారముంటుందని నెగెటివ్‌ రోల్‌ని ఎంచుకొని చేశాను. గాడ్సే’తో వచ్చిన స్పందన చూశాక సినిమాల్లో నా జర్నీని కొనసాగిస్తాను. ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి సిద్ధం’ అన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International