మనోధైర్యంతో ముందుకు సాగండి

ABN , First Publish Date - 2021-01-17T05:35:25+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకు న్న వారు మనోధైర్యంతో ముందుకు సాగి అందరికీ ఆ దర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కరణం బలరాం సూచిం చారు. స్థానిక వైకుంఠపురం పీహెచ్‌సీలో శనివారం ఎంపిక చేసిన 15మంది ఆరోగ్య సిబ్బందికి కోషీల్డ్‌ వ్యా క్సిన్‌ను ఇచ్చారు.

మనోధైర్యంతో ముందుకు సాగండి
అద్దంకిలో వాక్సినేషన్‌ వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌



చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం

పలుచోట్ల కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పరిశీలన


చీరాల, జనవరి 16 : కరోనా వ్యాక్సిన్‌ వేయించుకు న్న వారు మనోధైర్యంతో ముందుకు సాగి అందరికీ ఆ దర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కరణం బలరాం సూచిం చారు. స్థానిక వైకుంఠపురం పీహెచ్‌సీలో శనివారం ఎంపిక చేసిన 15మంది ఆరోగ్య సిబ్బందికి కోషీల్డ్‌ వ్యా క్సిన్‌ను ఇచ్చారు. శైలజ అనే ఏఎన్‌ఎంకు తొలివ్యాక్సి న్‌ను మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు చేశా రు. వ్యాక్సిన్‌ చేసే విధానంపై ఎమ్మెల్యే, ఏరియా వైద్య శాల సూరింటెండెంట్‌ శేషుకుమార్‌, పీపీ యూనిట్‌ వై ద్యాధికారి కమలశ్రీ, పీహెచ్‌సీ వైద్యాధికారి అమృతశ్రీల తో మాట్లాడారు. ముందుగా టీవీలో ప్రధాని మోదీ ప్ర సంగాన్ని వీక్షించారు. అనంతరం వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని అరగంట పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు.  ఎవ రికీ ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అందరూ సంతో షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ చేయించుకున్న వారు 28వ రోజు రెండో విడిత వ్యాక్సిన్‌ను చేయించు కోవాలని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో తహ సీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఏస య్య, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వరికూటి అమృత పాణి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, మించాల సాంబశివరావు పాల్గొన్నారు.


వైద్యుల సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే గొట్టిపాటి


అద్దంకి: కరోనా విజృంభించిన సమయంలో వైద్యు లు ప్రాణాలను సైతం  లెక్క చేయకుండా వైద్య సేవ లు అందించారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పే ర్కొన్నారు. అద్దంకి  సీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ విధానాన్ని వైద్యులు నాగభూషణం,  వహి దాచౌదరి ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం 20 మంది సిబ్బంది, వైద్యులకు కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. వ్యాక్సిను తయారు చేసిన శాస్త్రవేత్తలకు, ప్రధాని మో దీకి ఎమ్మెల్యే గొట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు.  సీహె చ్‌సీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య సిబ్బ ందికి 4 నెలలుగా జీతాలు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీ సుకొచ్చారు. వెంటనే జీతాలు చెల్లించాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌, వైద్యాధికారులకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆరుగురు ఉండాల్సిన చోట ఇద్దరు వైద్యులే ఉన్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఉషతో ఫో న్లో మాట్లాడి డిప్యూటేషన్‌పై డాక్టర్‌ని నియమించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ నా గినేని రామకృష్ణ, టీడీపీ నాయకులు కరి పరమేష్‌, సం దిరెడ్డి శ్రీనివాసరావు, కుందారపు రామారావు, మానం మురళీమోహన్‌దాస్‌, బండారు రాఘవ, రామాంజనే యులు, చుండూరి మురళీ, స్టాలిన్‌, కాకాని అశోక్‌, మ న్నం త్రిమూర్తులు, గోపి, వీరాంజనేయులు పాల్గొన్నా రు. వ్యాక్సినేషన్‌ను జేసీ చేతన్‌, వైద్యశాల జిల్లా అధి కారి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. 


ప్రాణాలను ఫణంగా పెట్టారు : బాచిన కృష్ణచైతన్య


మేదరమెట్ల: వైద్యులు వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది  కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించారని  వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు. శనివారం కొరిశపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్య క్రమాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక ఆరోగ్య కేంద్రా నికి 500 డోసులు వచ్చినట్లు వైద్యాధికారులు కృష్ణచైత న్యకు వివరించారు. అనంతరం 27 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు డాక్టర్‌ నాగమణి వ్యాక్సిన్‌ వేశారు. కార్యక్ర మంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి గ్లోరియా, తహసీ ల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో బీవీ.సాయికుమారి, వై ద్యాధికారులు వెంకటసుబ్బాయ్య పాల్గొన్నారు.






Updated Date - 2021-01-17T05:35:25+05:30 IST