భూ సమస్యపై కోర్టుకు వెళ్లమంటున్నారు

ABN , First Publish Date - 2022-05-17T04:47:38+05:30 IST

ఏడేళ్ల క్రితం సర్వే నెంబర్‌ 161, 162లో మూడు ఎకరాల సాగు భూమిని ఈదులపల్లి లక్ష్మయ్య తో కొనుగోలు చేశాం.

భూ సమస్యపై కోర్టుకు వెళ్లమంటున్నారు
ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్లు

- బాధితురాలు ఆవేదన 

- అధికారుల తప్పిదానికి వారే సరి

   చేయాలని డిమాండ్‌

- ప్రజావాణిలో 72వినతులు

  స్వీకరించిన అధికారులు

మహబూబ్‌నగర్‌ ( కలెక్టరేట్‌ ), మే 16 : ఏడేళ్ల క్రితం సర్వే నెంబర్‌ 161, 162లో మూడు ఎకరాల సాగు భూమిని ఈదులపల్లి లక్ష్మయ్య తో కొనుగోలు చేశాం. ఆయన అంతకు ముందు కుమ్మం మల్లయ్యతో కొన్నాడు. కానీ, కుమ్మం మల్లయ్య అమ్ముకున్న భూమికి తిరిగి కొత్త పాసుబుక్కులు ఎట్టా వస్తాయి, మాకు ఇచ్చినట్లే ఆయనకు రైతు బంధు  ఇస్తున్నారు. ఈ విష యంపై కలెక్టర్‌ సారోళ్ల దగ్గరికి వస్తే వాళ్లు కోర్టుకు పొమ్మని చెపుతున్నారని బాలనగర్‌ మండలం చిన్నరేవల్లి ఎర్రకుంట తండాకు  చెం దిన గోవింద్‌ భార్య మోతి ‘ఆంధ్రజ్యోతి’తో వా పోయారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె  అదనపు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఈ విష యమై మోతి  ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ మేము 2016లో డాక్యూమెంట్‌ ద్వారా నా భర్త గోవింద్‌ పేరున ఎకరంన్నర, మరో ఎకరంన్నర శంకర్‌ పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకన్నాం. అధికా రుల తప్పేదానికి మేము ఎందుకు కోర్టుకు వె ళ్లాలని ప్రశ్నించింది. మేము కొన్న భూమిపై ఆయన (కుమ్మం మల్లయ్య ) బ్యాంకులో లోన్‌ తీసుకున్నాడు, మరి ఈ భూమినే అమ్మేందుకు చూస్తున్నారని విషయం తెలిసి అధికారులకు ఫిర్యాది చేసేందుకు వస్తే అధికారులేమో కోర్టుకు వెళ్లాలని చూయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి తప్పు చేయలేదని, తప్పు చేయనిది ఎందుకు కోర్టుకు పోవలని, ఈ తప్పును అధికారులే సరిదిద్దాలని ఆమె డిమాండ్‌ చేసింది. అదేవిదంగా దేవరకద్ర మం డలం జీనుగురాల, గండీడ్‌ మండలం రంగారెడ్డి పల్లికి చెందిన వృద్ధులు కూడా ఇలాంటి భూవివాధాలపైనే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, జడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్‌డీవో యాదయ్య, ఏవో కిషన్‌ బాధితుల నుంచి  72 ఫిర్యాదులు స్వీకరించారు.

Updated Date - 2022-05-17T04:47:38+05:30 IST