నా స్నేహితుడి పుట్టినరోజు కోసం రష్యా వెళ్లా: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ABN , First Publish Date - 2021-09-15T22:37:23+05:30 IST

తన స్నేహితుడి పుట్టినరోజు కోసం రష్యా వెళ్లానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

నా స్నేహితుడి పుట్టినరోజు కోసం రష్యా వెళ్లా: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

అమరావతి: తన స్నేహితుడి పుట్టినరోజు కోసం రష్యా వెళ్లానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయలు పెట్టి వెళ్లానని ప్రచారం చేశారని తప్పుబట్టారు. పర్యటనలో ఓ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని తెలియగానే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని విమర్శించారు. ‘‘రెండు నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక విమానంలో మారిషస్ వెళ్లారు. రెండు ఎకరాలు పొలం నుండి వచ్చిన వ్యక్తి ఏ పర్యటనకైనా వెళ్లవచ్చు. ల్యాండ్ సీలింగ్స్‌లో వందల ఎకరాలు పోగొట్టుకున్న మేము ఏ పర్యటనకు వెళ్లకూడదా? దాపరికాలు లేకుండా రష్యా పర్యటన గురించి నేనే ట్వీట్ చేశా. దొంగచాటుగా పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చెన్నై హవాలా అంటారు.. నోటికొచ్చిన అబద్ధాలు చెబితే ప్రజలు సహించరు’’ అని బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2021-09-15T22:37:23+05:30 IST