పేట్రేగిన చైన్‌స్నాచర్లు

ABN , First Publish Date - 2021-01-17T06:03:51+05:30 IST

చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. పూతలపట్టు మండలంలో ఓ చోట మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేయడంతో పాటు యాదమరి మండలంలో మరో మూడు చోట్ల బైక్‌పై వెళ్తున మహిళల మెడలో చైన్లు లాగారు.

పేట్రేగిన చైన్‌స్నాచర్లు
కమ్మరాయనిమిట్ట వద్ద సీసీ కెమెరా పుటేజీలో నమోదైన అనుమానితులు

మహిళ మెడలో బంగారుగొలుసు చోరీ


మరో మూడు చోట్ల విఫలయత్నం


పోలీసుల అదుపులో నిందితుడు?


పూతలపట్టు/యాదమరి జనవరి 16:  చైన్‌స్నాచర్లు  చెలరేగిపోయారు. పూతలపట్టు మండలంలో ఓ చోట మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేయడంతో పాటు యాదమరి మండలంలో మరో మూడు చోట్ల  బైక్‌పై వెళ్తున మహిళల మెడలో చైన్లు లాగారు.   ఐరాల మండలం పొలకల గ్రామానికి చెందిన వసంత  భర్తతో కలిసి పెనుమూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు పూతలపట్టు మండలంలోని తలపులపల్లె సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి  వసంత మెడలో ఉన్న 36 గ్రాముల బంగారు గొలుసు లాక్కెళ్లారు. కిందపడిపోయిన వసంత లేచి అరిచేలోగా దొంగలు పారిపోయారు. వసంత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే యాదమరి మండల పరిధిలో చిత్తూరు - గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిపై కమ్మరాయనమిట్ట, గాంధీపురం వద్ద, చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై ముత్రపల్లె వద్ద మూడు చోట్ల చైన్‌స్నాచర్లు బైక్‌పై వెళ్తున మహిళల మెడలో చైన్లు లాగారు.  అయితే అవి తెగి కింద పడిపోయాయి. ఓ ఘటనలో చైన్‌స్నాచర్లు గొలుసు లాగగా బైక్‌ నుంచి పడి 12 కమ్మపల్లె సచివాలయంలో పనిచేసే సౌజన్యకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకుల్లో ఒకరిని పూతలపట్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నంలో ఓ యువకుడు పరారవగా, మరొక యువకుడు పట్టుబడినట్లు సమాచారం.


Updated Date - 2021-01-17T06:03:51+05:30 IST