బంగారం రుణాలు@రూ.లక్ష కోట్లు

ABN , First Publish Date - 2022-07-03T09:14:58+05:30 IST

ప్రభు త్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ బంగా రం రుణాల మంజూరులో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

బంగారం రుణాలు@రూ.లక్ష కోట్లు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ బంగా రం రుణాల మంజూరులో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. జూన్‌ నాటికి బంగారం రుణాలు రూ.లక్ష కోట్ల మార్కును అధిగమించాయని బ్యాంక్‌ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే రుణాల మంజూరులో 26.19 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 435 గోల్డ్‌లోన్‌ ప్లాజా శాఖల ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు. ఇదే కాలంలో రిటైల్‌, హౌసింగ్‌, ఎంఎ్‌సఎంఈ, వ్యవసాయ, కార్పొరేట్‌ రుణాల మంజూరులోనూ రెండంకెల వృద్ధిని సాధించినట్లు ఆయన చెప్పారు. బంగారంపై స్వల్పకాలిక రుణాలకు భారీగా డిమాండ్‌ నెలకొని ఉందన్నారు. ఖాతాదారుల ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంక్‌ సేవలందిస్తోందన్నారు. అంతేకాకుండా తమపై ఖాతాదారులు ఉంచిన విశ్వాసాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు గాను బ్యాంక్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ప్రభాకర్‌ వివరించారు. 

Updated Date - 2022-07-03T09:14:58+05:30 IST