పది నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం ధర

ABN , First Publish Date - 2021-03-07T00:54:17+05:30 IST

కళ్లేలు లేనట్టుగా ఇటీవల పరుగులు పెట్టిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో

పది నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం ధర

న్యూఢిల్లీ: కళ్లేలు లేనట్టుగా ఇటీవల పరుగులు పెట్టిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పది గ్రాముల బంగారం ధర రూ. 44 వేల దిగువకు పడిపోయింది. 22 కేరెట్ల బంగారం గ్రాము ధర శనివారం రూ.4,390 నుంచి రూ.4,343కు చేరుకుంది. ఫలితంగా పుత్తడి ధర పది నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలోనూ బంగారం ధరల్లో క్షీణత కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్స్ బంగారం ధర 0.2 శాతం తగ్గి 1,693.79 డాలర్లకు చేరుకుంది. ఇక ఈ వారం బంగారం ధర 2 శాతానికిపైగా తగ్గింది. అదే సమయంలో వెండి ధర మాత్రం 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు 25.35 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 43,950 నుంచి రూ. 43,600కు తగ్గింది. ముంబైలో మాత్రం రూ. 43,430గా ఉంది. వెండి ధర కిలోకు రూ. 1,822 పెరిగి రూ. 64,805కు చేరింది.  

Updated Date - 2021-03-07T00:54:17+05:30 IST