మళ్లీ తగ్గిన బంగారం ధర

ABN , First Publish Date - 2022-06-15T15:25:49+05:30 IST

రూపాయి విలువ పెరగడంతో బుధవారం మళ్లీ బంగారం ధర తగ్గింది....

మళ్లీ తగ్గిన బంగారం ధర

న్యూఢిల్లీ : రూపాయి విలువ పెరగడంతో బుధవారం మళ్లీ బంగారం ధర తగ్గింది. బుధవారం 10 గ్రాములపై ధర రూ.960లకు పైగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,400గా ఉంది.ఇది మంగళవారం రూ.48,360గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1050 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాని క్రితం ముగింపు రూ.52,760గా ఉండగా, బుధవారం రూ.51,710కు తగ్గింది.వెండి ధర కూడా తగ్గింది. గత ట్రేడింగ్‌లో కిలో వెండి రూ.60,738 నుంచి రూ.864 తగ్గి రూ.59,874కి చేరుకుంది.బుధవారం దేశంలోని వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ నగరంలో రూ 47,400, చెన్నైలో రూ. 47,550, ముంబైలో రూ 47,400,ఢిల్లీలోరూ. 47,400,కోల్‌కతా నగరంలో రూ. 47,400, బెంగళూరు నగరంలో రూ 47,400,భువనేశ్వర్ నగరంలో 47,400రూపాయలుగా ఉంది.


Updated Date - 2022-06-15T15:25:49+05:30 IST