Viral Video: వామ్మో.. చివరికి దీన్ని కూడా వదల్లేదుగా.. రూ.70లక్షల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు..

ABN , First Publish Date - 2022-10-02T23:49:09+05:30 IST

సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉపయోగించుకుని పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది.. బంగారం వంటి విలువైన లోహాల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో స్మగ్లర్లు కూడా అధికారులకు దొరక్కుండా ఉండేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు. ప్రస్తుతం అం

Viral Video: వామ్మో.. చివరికి దీన్ని కూడా వదల్లేదుగా.. రూ.70లక్షల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు..

ఇంటర్నెట్ డెస్క్: సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉపయోగించుకుని పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది.. బంగారం వంటి విలువైన లోహాల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో స్మగ్లర్లు కూడా అధికారులకు దొరక్కుండా ఉండేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు.. షాకవుతున్నారు. అంతేకాకుండా ‘వామ్మో.. చివరికి దీన్ని కూడా వదల్లేదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ విషయం ఏంటంటే..



కొందరు స్మగ్లర్లు.. రూ.70లక్షల విలువైన బంగారాన్ని ఎలాగోలా చెన్నై వరకు తీసుకొచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ నుంచి దాన్ని బయటకు తరలించడానికి పెద్ద ప్లాన్ వేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లోర్‌ను క్లీన్ చేసే ఓ వ్యక్తికి డబ్బు ఆశ చూపించారు. అతడు సరే అనడంతో.. ప్రణాళికను అమలు పరిచారు. క్లీనింగ్ మాప్‌‌కు జత చేసి ఉండే.. పొడవాటి ప్లాస్టిక్ పైపు రంధ్రంలో రూ.70లక్షల విలువైన 10 బంగారు కడ్డీలను వేసి, వాటిని బయటికి తరలించబోయారు. అయితే.. ఫ్లోర్ క్లీన్ చేసే వ్యక్తి వైఖరిని చూసి అనుమానం వ్యక్తం చేసిన సెక్యూరిటీ సిబ్బంది.. అతడిని తనిఖీ చేశారు. అంతేకాకుండా అతడి చేతిలో ఉన్న క్లీనింగ్ మాప్‌ను స్కాన్ చేశారు. అందులో లోహాకారపు వస్తువులు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. వాటిని బయటకు తీశారు. ఈ క్రమంలోనే సుమారు 1.81కేజీల బంగారం కడ్డీల రూపంలో ఉండటాన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం నెట్టింట వైరల్ అయింది. 




Updated Date - 2022-10-02T23:49:09+05:30 IST