‘మాస్టర్‌ప్లాన’తో బంగారు బాటలు వేయాలి

ABN , First Publish Date - 2022-07-02T06:24:42+05:30 IST

‘మాస్టర్‌ప్లాన’తో బంగారు బాటలు వేయాలి

‘మాస్టర్‌ప్లాన’తో బంగారు బాటలు వేయాలి
మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

40ఏళ్ల ప్రణాళికతో రూపొందించాలి

‘సుడా’ సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

ఖమ్మం, జూలై 1 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): స్తంభాద్రి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో రూపొందించే మాస్టర్‌ప్లాన్‌తో ఖమ్మం నగర అభివృద్ధికి బంగారు బాటలు వేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన మాస్టర్‌ప్లాన రూపకల్పన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంచెలంచెలుగా ఎదిగిన ఖమ్మం.. కార్పొరేషనగా రూపుదిద్దుకుని పదేళ్లవుతున్నా ఆమోదిత మాస్టర్‌ప్లాన లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే 40ఏళ్ల వరకు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన, ఇతర అభివృద్ధి పనులకు పక్కా ప్రణాళికతో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సూచించారు. మాస్టర్‌ప్లాన ద్వారా త్వరితగతిన అనుమతులు పొందేలా ప్రజలకు అవగాహన కలిపించాలన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత ఖమ్మం నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ రూపొందించబోయే మాస్టర్‌ప్లాన రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలవాలన్నారు. రింగ్‌రోడ్డు అన్ని రహదారులకు అనుసంధానం అయ్యేలాచూడాలని, నరగంలో చుట్టుపక్కల ఏర్పాటవుతున్న రియల్‌వెంచర్ల విషయంలో నిబంధనలు అమలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. పోలీసుకమిషనరేట్‌, కార్పొరేషన్‌ భవనాలను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించుకున్నారని, ప్రజల భాగస్వామ్యంతో మున్ముందు నగరం మరింత విస్తరించనుందని ప్రజలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలతో మాస్టర్‌ప్లాన రూపొందించాలని తెలిపారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ ఈ మాస్టర్‌ప్లానపై అపోహలువద్దని, ఎంతో దూరదృష్టితో రూపొందిస్తున్నామన్నారు. అందరి సలహాలు, సూచనలమేరకు మాస్టర్‌ప్లాన ఉంటుందని, 15రోజుల్లో ముసాయిదా విడులచేస్తామన్నారు. అనంతరం 60రోజులపాటు ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని, 2041 వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేస్తున్నామన్నారు. సీపీ విష్ణువారియర్‌ మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా మాస్టర్‌ప్లానచూస్తామని పేర్కొన్నారు. సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సుడా పరిధిలోని 46 గ్రామాలను అభివృద్ధి చేసి పట్టణీకరణ చేసే లక్ష్యంతో మాస్టర్‌ ప్లాన్‌ ఉంటుందని, డ్రాఫ్ట్‌ నోటిఫికేషన విడుదల తర్వాత సమస్యలు దృష్టికి తేవచ్చాన్నారు. 60డివిజన్ల ప్లాన తయారుచేశామని, సుడా పరిధిలో నీటివనరులు గుర్తించామని తెలిపారు. సుడా పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, 80 రోడ్లను 30ఫీట్లనుంచి 40ఫీట్లుగా, ప్రస్తుతం 40ఫీట్లుగా ఉన్న వాటిని 60ఫీట్లురోడ్లుగా, 60ఫీట్లను 80ఫీట్లుగా మారుస్తూ మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదన చేశామన్నారు. రైల్వేస్టేషననుంచి కొత్త బస్టాండ్‌ వరకు రోడ్లు విస్తరణ చేపడతామన్నారు. ఈసమావేశంలో మేయర్‌ నీరజ, డిప్యూటీమేయర్‌ ఫాతిమాజోహర, నగర కమిషనర్‌ ఆదర్శ సురభి, అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన, డీసీసీబీ చైర్మన కూరాకుల నాగభూషణం, డీటీసీపీ అధికారి విద్యాధర్‌, వైరా మునిసిపల్‌ చైర్మన జయపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:24:42+05:30 IST