ఒలింపిక్స్‌కు గోల్ఫర్ అనిర్బన్
ABN , First Publish Date - 2021-06-23T09:32:24+05:30 IST
భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
న్యూఢిల్లీ: భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ పురుషుల గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో అనిర్బన్ 306వ స్థానంలో నిలిచాడు. టోక్యోలో గోల్ఫ్ క్రీడ నుంచి పోటీపడేందుకు భారత్‌కు ఒక స్థానం ఖరారవగా.. మన దేశం తరఫున టాప్ ర్యాంకర్‌గా నిలిచిన 33 ఏళ్ల అనిర్బన్కు నేరుగా ఒలింపిక్ బెర్త్ దక్కింది.