శనగల కొనుగోళ్లలో గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-06-29T04:39:34+05:30 IST

జిల్లాలో శనగ పంట కొనుగోళ్లలో గోల్‌మాల్‌ దందావెలుగు చూసింది. ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆదివాసీ జన సంరక్షణ వెల్ఫేర్‌ సొసై టీ పేరిట రైతుల నుంచి శనగ పంటను కొనుగోలు చేశారు.

శనగల కొనుగోళ్లలో గోల్‌మాల్‌
శనగ పంటలను కొనుగోలు చేస్తున్న దృశ్యం(ఫైల్‌)

నిండా ముంచిన ఆదివాసీ జన సంరక్షణ వెల్ఫేర్‌ సొసైటీ 

రూ.3 కోట్ల పంట డబ్బులతో సొసైటీ నిర్వాహకుడి పరారీ

వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతోనే విక్రయించామంటున్న అన్నదాతలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

ఆదిలాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనగ పంట కొనుగోళ్లలో గోల్‌మాల్‌ దందావెలుగు చూసింది. ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆదివాసీ జన సంరక్షణ వెల్ఫేర్‌ సొసై టీ పేరిట రైతుల నుంచి శనగ పంటను కొనుగోలు చేశారు. 

జిల్లావ్యాప్తంగా 300 మంది రైతులు 

జిల్లావ్యాప్తంగా సు మారు 300 మంది రై తుల నుంచి శనగ పంటను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ వద్ద వివరాలను నమోదు చేసుకోకపోవడంతో పంట విక్రయించేందుకు అధికారులు నిరాకరించారని రైతులు చెబుతున్నారు. దీంతో గ త్యంతరం లేక సొసైటీకి పంటను అమ్ముకోవాల్సి వచ్చిందంటున్నారు. ఇప్పటివరకు డబ్బులు చేతికి రాకపోవడంతో ఆందో ళనకు గురవుతున్నారు. ఇటీవల ఇంద్రవెల్లి పోలీసుస్టేషన్‌లో కొందరు రైతులు సొసైటీ నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు.జిల్లాలోని ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూర్‌, నేరడిగొండ, బోథ్‌ తదితర మండలాల్లో ఈ ఏడాది రబీలో పండించిన శనగ పంటను సొసైటీ కొనుగోలు చేసి చేతులెత్తెసింది. ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం ఉసేగాం గ్రామానికి చెందిన సొసైటీ నిర్వాహకుడు సోయం రవీందర్‌ శనగ రైతులను నిండా ముంచాడు. రైతులకు చెల్లించాల్సిన పంట డబ్బులను చెల్లని చెక్కుల రూపంలో ఇ వ్వడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సొసైటీ నిర్వాహకులతో మోసపోయామని గుర్తించిన రైతులు అధికారుల చుట్టూ తి రుగుతున్నారు. పంట డబ్బుల కోసం పలుమార్లు సొసైటీ చైర్మన్‌ను నిలదీయగా స మాధానం ఇవ్వలేక త ప్పించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. నాలుగైదు రోజులుగా ఫోన్‌ స్వి చ్చాఫ్‌ చేసి సొసైటీ నిర్వాహకుడు పరారైనట్లు చెబుతున్నారు. 

మాయమాటలు చెప్పి మోసం..

వారం రోజుల్లో పంట డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి రైతుల నుంచి శనగ పంటను కొనుగోలు చేసిన సొసైటీ నిర్వాహకుడు సోయం రవీందర్‌ ప్రస్థుతం పత్తాలేకుండా పోవడంతో రైతులు ఆందో ళనకు గురవుతున్నారు. ఇన్నాళ్లు ఇదిగో అదిగో అంటూ తప్పించుకున్న నిర్వాహకుడు ప్రస్థుతం కనిపించకుండానే పోయాడంటూ వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులకు సుమారు రూ.3కోట్ల వరకు పంట డబ్బులు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ ఏడాడి శనగకు రూ. 5230 మద్దతు ధర ఉండగా సొసైటీ ఆధ్వర్యంలో క్వింటాల్‌ శనగలు రూ.5వేలతో కొనుగోలు చేశారు. తక్కువ ధరైనా వారంరోజుల్లో డ బ్బులు చేతికి వస్తాయని ఆశపడ్డ అసలుకే మోసం అయిందని చెబుతున్నారు. ఇప్పటికే క్వింటాల్‌కు రూ.230 చొప్పున నష్ట పోయామని రావాల్సిన డబ్బులను కూడా చెల్లించడం లేదని అం టున్నారు. పంట పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోయామని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 

అధికారులతో కుమ్మక్కు..

ఆదివాసీ జన సంరక్షణ వెల్ఫేర్‌ సోసైటీ నిర్వాహకుడు సోయంరవీందర్‌ వ్యవసాయ శాఖ అధికారులతో కుమ్మకై రైతుల నుంచి శనగ పం టను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకే సదరు సొసైటీకి పంటను అమ్మినట్లు రైతులు పేర్కొంటున్నారు. తీరా డబ్బులు చేతికి రాకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్తే సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా సొసైటీ నిర్వాహకుడు వ్యవసాయ శాఖ అధికారులతో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాసులకు కక్కుర్తి పడి కొందరు అధికారులు పంటను విక్రయించేలా ప్రోత్సహించారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఇంద్రవెల్లి వ్యవసాయ శాఖాధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Updated Date - 2022-06-29T04:39:34+05:30 IST