గొలుగొండ జడ్పీటీసీ స్థానం ప్రకటన

Sep 21 2021 @ 00:51AM
ధ్రువపత్రం అందుకుంటున్న గిరిబాబాబు

  పాకలపాడులో రెండు బ్యాలెట్‌ బాక్స్‌లు తడిసిపోవడంతో నిలిపివేత

  తాజాగా వెల్లడించడంతో వైసీపీ అభ్యర్థి విజేత 

 గొలుగొండ, సెప్టెంబరు 20 : గొలుగొండ జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి సుర్ల వెంకట గిరిబాబు గెలుపొందారు. సమీప టీడీపీ అభ్యర్థి అడిగర్ల అప్పలనాయుడుపై 6917 ఓట్లతో విజయం సాధించారు. పాకలపాడు ఎంపీటీసీ స్థానంలో రెండు బ్యాలెట్‌ బాక్సులు తడిసిపోవడంతో ఆదివారం ఈ స్థానం ఫలితాలు ప్రకటించని విషయం తెలిసిందే. అయితే సోమవారం మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గోపీకుమార్‌ ఈ ఫలితాన్ని ప్రకటించి వెంకటగిరిబాబుకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. మొత్తం ఓట్లు 41,413 కాగా, 28,145 పోలయ్యాయి. వైసీపీకి 16185, టీడీపీకి 9689, జనసేనకు 660, సీపీఎంకు 138, కాంగ్రెస్‌కు 46, సీపీఐకి 280, బీజేపీకి 235 వచ్చాయి. నోటాకు 215  , చెల్లనివి 697, కాగా బ్యాలెట్‌ ఓట్లు 59 పోలయ్యాయి. వాటిలో వైసీపీకి 48, టీడీపీకి 11 ఓట్లు పడ్డాయి.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.