పారదర్శకంగా పాలన

ABN , First Publish Date - 2022-08-20T04:19:57+05:30 IST

ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోనే ఇసుక పాలెం గ్రామంలో శుక్రవారం ఆయన గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పారదర్శకంగా పాలన
వ్యక్తికి కరపత్రాలు ఇస్తున్న మంత్రి కాకాణి

వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి

తోటపల్లిగూడూరు, ఆగస్టు 19 :  ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోనే ఇసుక పాలెం గ్రామంలో శుక్రవారం ఆయన గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రోడ్లు, ఇరిగేషన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రూ.5లక్షలతో గ్రామంలో నిర్మించిన, సుజల తాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమైక్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చేలా పనిచేయాలన్నారు. తొలుత గ్రామంలో మంత్రికి రెండెద్దుల బండిపై స్వాగతం పలికి ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, విజయ డెయిరీ మాజీ చైర్మన్‌ చిల్లకూరు సుధీర్‌రెడ్డి, వైసీపీ నేతలు మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్‌, చిరంజీవి గౌడ్‌, తిరుపతయ్య, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T04:19:57+05:30 IST