భవిష్యత్‌లో పసుపు రైతులకు మంచిరోజులు

ABN , First Publish Date - 2021-01-24T05:00:20+05:30 IST

భవిష్యత్‌లో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయని, అందుకు అన్ని చ ర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌ప ల్లి మండలం చౌట్‌పల్లి గ్రామంలో గత పార్లమెంట్‌ ఎన్నిక ల్లో పోటీ చేసిన పసుపు రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

భవిష్యత్‌లో పసుపు రైతులకు మంచిరోజులు
మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ 

ఆర్మూర్‌/కమ్మర్‌పల్లి, జనవరి 23: భవిష్యత్‌లో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయని, అందుకు అన్ని చ ర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌ప ల్లి మండలం చౌట్‌పల్లి గ్రామంలో గత పార్లమెంట్‌ ఎన్నిక ల్లో పోటీ చేసిన పసుపు రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పసుపుబోర్డు కంటే ఎక్కువ ప్రయోజ నాలు కలిగే స్సైసెస్‌ బోర్డును మంజూరు చేశామన్నారు. దీ ని వల్ల పెద్దమొత్తంల నిధులు వస్తున్నాయన్నారు. గతంలో తెలంగాణకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షలు వస్తే ఈ యేడు రూ.30కోట్లు వచ్చాయన్నారు. బాయిలర్లు, టార్పా యిన్లు పెద్ద మొత్తంలో మంజూరవుతున్నాయన్నారు. పసు పునకు ధర పెరగాలనే ఉద్దేశంతో దిగుబడి బ్యాన్‌ చేశామ ని, ఈయేడు 99వేల టన్నుల పసుపు ఎగుమతి చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సారి నిజామాబాద్‌ నుంచి 10 వేల టన్నులు బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేశామన్నారు. రాష్ట్రా నికి పెద్ద సంఖ్యలో ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌స్టోరేజీలు, వేర్‌హౌజ్‌ గోదాంలు వచ్చే అవకాశముందన్నారు. పసుపు పండించిన రైతుకు ధర రావడంలేదని, దళారులు విదేశాల కు ఎగుమతి చేసి పెద్దమొత్తంలో లాభపడుతున్నారన్నారు. జిల్లాలోని ఎల్కటూరు నుంచి పెద్ద కంపెనీ వారు పసుపు శాంపిళ్లు తీసుకెళ్లారని, మొదటి కొనుగోలు కేంద్రం అక్కడే ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. తాను గెలిచి నప్పటి నుంచే రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు చేప ట్టానని, కరోనా వల్ల ఏడాది ఆటంకం కలిగిందన్నారు. స్సైసె స్‌ బోర్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి నాలు గేళ్లు పడుతుందని, అప్పటి వరకు రైతులకు ధర రావడాని కి కూడా కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే పసుపునకు క్వింటాకు రూ.10వేలు ఇవ్వడానికి కేంద్రంతో మాట్లాడుతానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పసుపునకు క్వింటా లుకు రూ.7వేలు చెల్లిస్తున్నారని, కాబట్టి తెలంగాణ ప్రభు త్వం ఒక ధర నిర్ణయించి లేఖ పంపాల్సి ఉంటుందన్నారు. పసుపునకు ధర నిర్ణయించి కేంద్రానికి పంపడం రాష్ట్ర ప్ర భుత్వం బాధ్యత అని, ఆ బాధ్యతను నెరవేర్చాలన్నారు. గత ంలో రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపిందని, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఎందుకు పంపదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభు త్వం బాధ్యత రాష్ట్రం చేస్తే కేంద్ర ప్రభుత్వ బాధ్యత కేంద్రం చేస్తుందన్నారు. పసుపును ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ జాబితా నుం చి తొలగిస్తామని ఎంపీ అర్వింద్‌ అన్నారు. కేంద్రం నియ మించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రైతులకు ఏ విధంగా చేస్తే మే లు జరుగుతుందనే విషయమై రాష్ట్రంలో, జిల్లాలో పర్యటిం చి వివరాలు సేకరించి నివేదికను కేంద్ర వ్యవసాయ మం త్రిత్వ శాఖకు అందజేసిందన్నారు. అందులో ఫ్యూచర్‌ ట్రేడి ంగ్‌ జాబితా నుంచి తొలగించాలనే సిఫారసు ఉందన్నారు. ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ నుంచి పసుపు తొలగించే ప్రక్రియ మొద లైందన్నారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడా నికి కృషి చేస్తున్నానని, అవి చెప్పడానికి ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చని వారు ప్రజల్లోకి రార న్నారు. తాను ఎంపీ అయిన తర్వాత పలుమార్లు అధికారు లతో చర్చించానని, రైతులను కూడా ఢిల్లీకి తీసుకెళ్తానని, ఢి ల్లీ నుంచి అధికారులను కమ్మర్‌పల్లి వరకు తీసుకొచ్చానన్నా రు. స్సైసెస్‌ బోర్డు రీజనల్‌ కార్యాలయం తీసుకొచ్చామన్నా రు. కేంద్ర బడ్జెట్‌ 12టైమ్స్‌ పెంచామన్నారు. పసుపు రైతుల కు అన్ని విధాలా లాభం జరగడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

రసాభాసగా రైతుల సమావేశం

పసుపు రైతులతో నిర్వహించిన సమావేశం రసాభాసగా జరిగింది. పసుపుబోర్డు, మద్దతు ధర సాధనలో విఫలమై నందున ఎంపీ తన పదవికి రాజీనామా చేయాలని పలు వురు రైతులు డిమాండ్‌ చేశారు. ఎంపీ సమాధానం చెప్పా లని పట్టుబట్టారు. ఎంపీ ప్రసంగించే సమయంలో కూడా రైతులు అడ్డుతగిలారు. పలుమార్లు గందరగోళ పరిస్థితి ఏ ర్పడింది. చివరికి ఎంపీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగి ంచి పోలీసుల సహకారంతో బయటకు వెళ్లిపోయారు. 

Updated Date - 2021-01-24T05:00:20+05:30 IST