పిల్లల ఆరోగ్యం కోసం.. ఎలాంటి ఆహారం తినిపించాలంటే?

ABN , First Publish Date - 2022-03-19T18:16:34+05:30 IST

మంచి ఆహారం అందులోను పోషకాలుండే ఆహారం తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు మంచి

పిల్లల ఆరోగ్యం కోసం.. ఎలాంటి ఆహారం తినిపించాలంటే?

ఆంధ్రజ్యోతి(19-3-2022)

మంచి ఆహారం అందులోను పోషకాలుండే ఆహారం తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు మంచి ఆహారం తీసుకుంటే వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. చిన్నపిల్లలకు ఇవ్వాల్సిన ఆహారమిదే..


ఆయా కాలాల్లో వచ్చే సీజనల్‌ ఫ్రూట్స్‌ను పిల్లలకు తినిపించాలి. బత్తాయి, తర్బూజ, ద్రాక్ష, వాటర్‌మెలన్‌ తినిపించాలి. అవి కూడా తాజాగా ఉండాలి. పండ్లను ఇష్టపడకపోతే జ్యూస్‌ల రూపంలో ఇవ్వాలి. అరటి, సపోటా, ఆపిల్‌ పండ్లు పోషకాల నిలయం. చిన్నపిల్లలకు రసమన్నం తినిపించాలి. సులువుగా జీర్ణమవుతుంది. దీంతో పాటు పెరుగన్నం తినిపించాలి. ఇందులోని ప్రొబయోటిక్స్‌ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల పొట్టలో గడబిడలుండవు. సులువుగా జీర్ణమవుతుంది. బచ్చలి, తోటకూర, కొత్తిమీర, పుదీనా.. ఇలా ఆకుకూరలతో చేసిన ఆహారాన్ని పిల్లలకు తినిపించాలి. వీటితో పాటు క్యారెట్‌, బీట్‌రూట్‌ లాంటి బలవర్ధకమైన ఆహారం పెట్టాలి. వెల్లుల్లి తినటం అలవాటు చేయిస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, కిస్మిస్‌ లాంటి డ్రై ఫ్రూట్స్‌ తింటే పిల్లల ఇమ్యూనిటీ అధికమవుతుంది.  కోడిగుడ్లు, మాంసాహారం, చేప లాంటి బలవర్ధకమైన ఆహారం ఎదిగే పిల్లలకు మంచిది.

Updated Date - 2022-03-19T18:16:34+05:30 IST