బీజేపీతోనే సుపరిపాలన

ABN , First Publish Date - 2022-07-01T05:47:52+05:30 IST

అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమవుతుందని గుజరాత్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌బాయ్‌పటేల్‌ అన్నారు.

బీజేపీతోనే సుపరిపాలన
నాగర్‌కర్నూల్‌లో మాట్లాడుతున్న గుజరాత్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌బాయ్‌ పటేల్‌

- గుజరాత్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌బాయ్‌ పటేల్‌


నాగర్‌కర్నూల్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమవుతుందని గుజరాత్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌బాయ్‌పటేల్‌ అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం పేరిట భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై విచారణ చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కోరుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న బహిరంగ సభకు జన సమీకరణతో పాటు క్యాడర్‌ను సమాయత్తపరిచేందుకు గురువారం జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్స్‌లో నిర్వహించిన సన్నాహక సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో నితిన్‌బాయ్‌పటేల్‌ మాట్లాడుతూ బీ జేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మోదీ నాయకత్వంలో గణనీ యమైన అభివృద్ధిని సాధిస్తుందన్నారు. తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నా రు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనతో జనం విసుగెత్తిపోయా రని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం చేసిన అవినీతి అక్రమాలపై కచ్చితంగా విచారణ జరుగుతుంద న్నారు. తెలంగాణలో జరిగిన అవినీతిని హోంమంత్రి అమిత్‌షా దృ ష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రజా సమస్యల కోసం పోరాటాలు ఉధృ తం చేసి భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జూలై 3న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన ఉద్బోధించారు. సమావేశంలో బీజేపీ నేతలు రాజావర్ధన్‌రెడ్డి, యుగంధర్‌రావు, బుసిరెడ్డి సుబ్బారెడ్డి, బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పోల్‌దాసు రాము, కొండానగేష్‌, మణెమ్మ, అపర్ణరెడ్డి, చంద్రకళ, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 


 కల్వకుర్తిలో బీజేపీ జెండా ఎగురవేయాలి

- బీజేపీ ఒడిస్సా అధ్యక్షుడు సమీర్‌ మహంతి


కల్వకుర్తి: కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిం చాలని బీజేపీ ఒడిస్సా రాష్ట్ర అధ్యక్షుడు సమీర్‌ మహంతి కోరారు. కల్వకుర్తి పట్టణంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో జాతీ య బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అధ్యక్షతన జరిగిన బీజేపీ మండల పదాధికారులు, బూత్‌ అధ్యక్షులు, కార్యదర్శుల నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి  సమీర్‌ మహంతితో పాటు జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు రాములు హాజరయ్యారు. ప్రధాని మన్‌కీబాత్‌ కార్యక్రమ సందేశాలను ప్రతీ ఒక్కరు విని ప్రజలకు వివరించాలన్నారు. అదేవిధంగా విక్రమాదిత్య స్కీం ద్వారా 9 సంక్షేమ పథకాలపై బూత్‌స్థాయిలో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేసేలా కార్య కర్తలు పని చేయాలని సమీర్‌మహంతి కోరారు. అనంతరం బీజేపీ జాతీయ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడారు.  ఎంపీటీసీ నర్సిరెడ్డి, నియోజకవర్గంలోని బీజేపీ ముఖ్య నేతలు, బీజేపీ నాయకులు మొగిలి దుర్గాప్రసాద్‌, రాఘవేందర్‌గౌడ్‌, నర్సింహ్మ, శేఖర్‌రెడ్డి, నర్సిం హ, కండె హరిప్రసాద్‌, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. 


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం 

- జమ్మూకశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌ కుమార్‌సింగ్‌ 

  అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, గుజరాథ్‌, హిమాచల్‌, యూపీ తరహా లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని జమ్మూకశ్మీర్‌  మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌ కుమార్‌సింగ్‌ అన్నారు. గురువారం నాగర్‌కర్నూ ల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్‌హాలు లో నిర్వహించిన  తెలంగాణ సంపత్‌ అభియాన్‌ కార్యక్రమంలో పా ల్గొని ఆయన మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. ఈనెల 3న హైదరాబాదులో జరిగే బహిరంగ సభ ద్వారా కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు మంగ్యానాయక్‌, రేణయ్య, బాలాజీ, జానకి, సైదులు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. 


కేంద్ర ప్రభుత్వ పథకాలు వాడవాడలా వివరించండి

- కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ పిలుపు

కొల్లాపూర్‌: కేంద్రంలో మోదీ సర్కార్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ ప థకాలను ప్రతీ పల్లెల్లో, ప్రతీ వాడలో ప్రజలకు వివరించాలని కేంద్ర మాజీ మంత్రి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు  పొన్ను రాధాకృష్ణన్‌ కొల్లాపూర్‌ బీజేపీ, బీజేవైఎం నేతలకు పిలుపునిచ్చారు. గురువారం కొల్లాపూర్‌ పట్టణంలోని లోటస్‌ మాన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సు ధాకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సంపర్క్‌ అభియా న్‌ కార్యక్రమాన్ని మహనీయుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  అనంతరం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రోజారమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి శశిరేఖ, వనపర్తి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి సీతమ్మలు పొన్ను రాధాకృష్ణన్‌ను శాలువాతో సన్మా నించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మూలే భరత్‌చంద్ర, ఉపాధ్యక్షుడు పుట్ట బాలచందర్‌, బీజేవైఎం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌, ఉపాధ్యక్షుడు కాటం మల్లికార్జున్‌, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్‌ దేశమోని పరుశరాం,  కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:47:52+05:30 IST