సదవకాశం

ABN , First Publish Date - 2021-04-12T04:38:43+05:30 IST

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలు చేసి మున్సిపల్‌ అభివృద్ధికి ఆ నిధులను వినియోగించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఆలోచనలు చేస్తోంది.

సదవకాశం
కామారెడ్డిలో 5 శాతం రిబేట్‌తో పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

పురపాలికల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లిస్తే 5 శాతం మినహాయింపు
ఆఫర్‌ ప్రకటించిన పురపాలక శాఖ
క్యూఆర్‌కోడ్‌, వ్యాట్సప్‌లోనూ చెల్లించే అవకాశం
ఏప్రిల్‌ 30 వరకు గడువు

కామారెడ్డి, ఏప్రిల్‌ 11: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలు చేసి మున్సిపల్‌ అభివృద్ధికి ఆ నిధులను వినియోగించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఆలోచనలు చేస్తోంది. అందులో భాగం గానే నివాస గృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు సంబం ధించి 2021-22 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5శాతం మినహాయింపునిస్తున్నట్లు రాష్ట్ర పురపా లకశాఖ ప్రకటించింది.  మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో పాటు పన్నుల వసూళ్లతో వచ్చే నిధులు వినియోగిస్తారు. దీంతో పన్ను వసూళ్లపై మున్సిపల్‌ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 2020-21 ఆర్థిక సంవ త్సరానికి పన్ను వసూళ్లలో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు పోటీ పడి మరీ రాత్రి సమయం వరకు మున్సిపల్‌ కార్యాలయంలోనే సమయం వెచ్చించి 100 శాతం పన్ను వసూళ్లకు చేరువయ్యారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు మున్సిపల్‌ అధి కారులు చర్యలు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం ప్రకటించి న 5శాతం మినహాయింపు ఏప్రిల్‌ 30వరకు మాత్రమే ఉందని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
డిజిటల్‌ పేకు శ్రీకారం
ప్రస్తుతం సమాజంలో డిజిటల్‌ పేకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతుండడం, కరోనా సమయం కావడంతో ప్రభు త్వం సైతం డిజిటల్‌ పే వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో  ఈ-సేవలు ప్రారంభించిన ప్రభుత్వం పన్నులను సైతం డిజిటల్‌ మార్గంలోనే వసూళ్లు చేయాలని ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది డిజిటల్‌ పేతో పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్‌ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. స్మార్ట్‌ఫోన్లలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌, వాట్సప్‌ నెంబర్‌ ద్వారా పన్ను స్వీకరించేందుకు శ్రీకారం చుట్టింది. సీడీఎంఏలో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే జిల్లా పేరు వస్తోంది. అనంతరం మున్సిపాలిటీని ఎంపిక చేసుకుని ఇంటి నెంబర్‌ టైప్‌చేస్తే ఆస్తిపన్ను ఎంత చెల్లించా లనేది వస్తోంది. ఆ తర్వాత నగదును చెల్లిస్తే నేరుగా మున్సిప ల్‌ ఖాతాలో జమ అవుతోంది. దీంతో అధికారులకు, వినియోగ దారులకు సమయం ఆదా కావడమేగాక నిర్ణీత గడువులోగా పన్ను చెల్లించే వీలు కలుగుతుందని ఈ పద్ధతికి ప్రభుత్వం మొగ్గు చూపిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పన్ను చెల్లింపునకు వాట్సప్‌ నెంబర్‌ 90002 53342 ఏర్పాటు
ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిషనర్‌, డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వారు  ఆస్తిపన్ను చెల్లింపునకు 90002 53342 సెల్‌ ఫోన్‌ నెంబర్‌ ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌కు ఏ లేదా తెలుగు అని టైప్‌ చేసి పంపింతే అందులో వివిధ రకాల సేవ లకు సంబంధించి సమాచారం వస్తోంది. ఆస్తిపన్ను వివరాలు చెల్లింపు, ఆస్తి పన్ను స్వీయ మదింపు, కుళాయి పొందుట, వ్యాపార అనుమతి, ప్రకటన కోసం సైనేజ్‌ లైసెన్స్‌, సెల్‌టవర్‌ అనుమతి, జనన/మరణ ధ్రువపత్రం, ఫిర్యాదుల పరిష్కారం, పౌరసేవా పత్రం సేవలు కనిపిస్తాయి. ఇందులో మనం చెల్లిం చాల్సిన ఆస్తిపన్ను వివరాలపై క్లిక్‌చేసి పంపిస్తే రిప్లే వస్తోంది. ఆ తర్వాత పీటీఐఎన్‌ నెంబర్‌ ను ఉపయోగించి ఆస్తిపన్ను చెల్లించవచ్చు.
ఈనెల చివరి వరకే అవకాశం
ప్రతీ సంవత్సరం ఆస్తిపన్ను వసూలు అను కున్న మేర జరగడం లేదని గ్రహించిన ప్రభుత్వం గత రెండు, మూడు సంవత్స రాల నుంచి సరికొత్త ఆలోచనలకు తెరలేపి అనుకున్న లక్ష్యాన్ని చేరుకు నేందుకు ప్రణాళికలు తయారు చేస్తోంది. అందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరంలో 90శాతం వడ్డీ రాయితీ ప్రకటించి 100శాతం ప న్ను వసూళ్లకు చేరువయింది. ప్ర స్తుతం 5శాతం మినహాయింపు అవకాశంను మళ్లీ తెరమీదకు తీసు కువచ్చింది. అయితే ఈ మినహా యిం పు అవకాశం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుందని మున్సిపల్‌ అధికారు లు పేర్కొంటున్నారు. రూ.లక్ష చెల్లింపులు జరి పిన వారికి రూ.5వేల తగ్గింపు, రూ. వెయ్యి ఉంటే రూ.950, రూ.500 ఉంటే రూ.475 ఇలా ప్రతీఇంటి, వాణిజ్య సముదాయానికి చెందిన పన్నుమొత్తంలో 5 శాతం రిబేట్‌ ఉంటుందని పేర్కొంటున్నారు.

ప్రజలు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలి
దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి
పన్ను వసూళ్లకై ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రిబేట్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా పన్ను వసూళ్ల లక్ష్యానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం. ఈ ఏడాది క్యూఆర్‌కోడ్‌, వాట్సప్‌తో మున్సిపాలిటీలోని వివిధ సేవలకు సంబం ధించిన పన్నులు చెల్లించవచ్చు. నిర్ణీత గడువులో గా పన్నులు చెల్లించి మున్సిపల్‌ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి.

Updated Date - 2021-04-12T04:38:43+05:30 IST