పుస్తక ప్రేమికులకు గుడ్ న్యూస్.. Lock The Box ఆఫర్‌తో వచ్చేసిన Bookchor

Published: Sat, 21 May 2022 21:12:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పుస్తక ప్రేమికులకు గుడ్ న్యూస్.. Lock The Box ఆఫర్‌తో వచ్చేసిన Bookchor

హైదరాబాద్: ప్రముఖ ఆన్‌లైన్ బుక్ స్టోర్ బుక్‌చోర్(Bookchor) సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చేసింది. లాక్ ద బాక్స్ రీలోడెడ్ (Lock The Box Reloaded) పేరుతో వినూత్నంగా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక్కో పుస్తకానికి విడివిడిగా ధర చెల్లించకుండా ఎంచుకున్న పుస్తకాలను బాక్స్‌లో పెట్టి దానికి ధర చెల్లించే సరిపోతుంది. శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఈ బుక్ ఫెయిర్ జరుగుతోంది. ఇందులో 10 లక్షలకు పైగా పుస్తకాలను ప్రదర్శిస్తున్నారు. అందులోంచి నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోవచ్చు.  వీటిలో ఫిక్షన్, నాన్ ఫిక్షన్, క్రైమ్, రొమాన్స్, ఎడ్వంచెర్, సైన్స్ ఫిక్షన్ వంటి పుస్తకాలతోపాటు చిన్నపిల్లల పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 26 నుంచి 29 వరకు మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.


బాక్సుల్లో మూడు రకాలు ఉన్నాయి. ఒడిస్సీ బాక్స్ ధర రూ. 1,199, పర్షియస్ బాక్స్ ధర రూ. 1,799 కాగా, హెర్క్యులస్ బాక్స్ ధర రూ. 2,999 మాత్రమే. ఈ సందర్భంగా బుక్‌చోర్ వ్యవస్థాపకుడు విద్యుత్‌శర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో లాక్ ద బాక్స్ రీలోడెడ్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతా, పూణె, ఇండోర్‌లలో నిర్వహించిన బుక్ ఫెయిర్‌కు అద్భుత స్పందన వచ్చిందని అన్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.