విద్యార్థులకు Good News: భారీగా స్టైఫండ్‌ పెంపు

ABN , First Publish Date - 2021-11-04T13:38:01+05:30 IST

విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే..

విద్యార్థులకు Good News: భారీగా స్టైఫండ్‌ పెంపు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): నర్సింగ్‌ విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే స్టైఫండ్‌ను ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వ నర్సింగ్‌ స్కూళ్లు, ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలు, నిమ్స్‌లో జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరి), బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు చేసే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. జీఎన్‌ఎం మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1500 స్టైఫండ్‌ను రూ.5,000కు, రెండో సంవత్సరం వారికి రూ.1700 నుంచి రూ.6000కు, మూడో ఏడాది వారికి రూ.1900 నుంచి రూ.7000కు పెంచింది. బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.1500 నుంచి రూ.5000కు, రెండో సంవత్సరంవారికి రూ.1700 నుంచి రూ.6000కు, మూడో సంవత్సరం వారికి రూ.1900 నుంచి రూ.7000కు, నాల్గో సంవత్సరం వారికి రూ.2200 నుంచి రూ.8000కు పెంచింది. కాగా, ఎమ్మెస్సీ నర్సింగ్‌ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు రూ.9000, రెండో సంవత్సరం వారికి రూ.10 వేల చొప్పున స్టైఫండ్‌ను మంజూరు చేసింది.  

Updated Date - 2021-11-04T13:38:01+05:30 IST