ఉపాధ్యాయులకు శుభవార్త

ABN , First Publish Date - 2022-10-06T17:02:31+05:30 IST

ఉద్యోగోన్నతులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ఉపాధ్యా యులకు తీపికబురు అందింది. ఎట్టకే లకు ప్రభుత్వం వారి ఉద్యోగోన్నతులకు పచ్చజెండా ఊపింది. షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. వివిధ సబ్జెక్టుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌

ఉపాధ్యాయులకు శుభవార్త

ఎన్నికేలకు ఉద్యోగోన్నతల షెడ్యూల్‌ విడుదల 


ఒంగోలు (విద్య), అక్టోబరు 4 : ఉద్యోగోన్నతులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ఉపాధ్యా యులకు తీపికబురు అందింది. ఎట్టకే లకు ప్రభుత్వం వారి ఉద్యోగోన్నతులకు పచ్చజెండా ఊపింది. షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. వివిధ సబ్జెక్టుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమా న్యాల్లోని పాఠశాలల్లో మొత్తం 782 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూలు అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు లభించను న్నాయి. ఈనెల 7 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. స్కూలు అసిస్టెం ట్లు, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల పోస్టు లకు ఆన్‌లైన్‌ విధానంలోనే అడ్‌హక్‌ ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. ఈనెల 13వతేదీతో పదోన్నతుల ప్రక్రియ ముగుస్తుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎ. సురేష్‌కుమార్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


782 మందికి ఉద్యోగోన్నతులు 

జిల్లాలో మొత్తం 782 మంది ఎస్జీటీ లకు స్కూలు అసిస్టెంట్లుగా, స్కూలు అసిస్టెంట్లు గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా ప్రమోషన్‌ లభించనుంది. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఇప్పటికే మంజూరై ఖాళీగా ఉన్న పోస్టులు, ఉపాధ్యాయుల పునర్విభజనలో కొత్తగా అవసరం కింద చూపించిన పోస్టులు మొత్తం 1,118  ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70శాతం ఉద్యోగోన్నతుల కింద 782 పోస్టులు, డైరెక్టు రిక్రూట్‌మెట్‌ డీఎస్సీ ద్వారా 336 పోస్టులు భర్తీచేస్తారు.


జడ్పీ పరిధిలో.. 

జడ్పీ యాజమాన్యంలో మొత్తం 1,029 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 452 గతంలో మంజూరైన పోస్టులు ఖాళీగా కాగా ప్రస్తుతం కొత్తగా సృష్టించినవి 577. ఈమొత్తంలో 720 పోస్టులను 70శాతం ప్రమోషన్ల ద్వారా, 309 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీచేస్తారు. ప్రస్తుతం గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు 49, స్కూలు అసిస్టెంట్‌ ఇంగ్లీషు 196, గణితం 127, బయాలజికల్‌ సైన్స్‌ 80, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 155, ఉర్దూ 9, సోషల్‌ స్టడీస్‌ 109 పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీచేస్తారు.


ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లలో ఇలా.. 

ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో మొత్తం 89 ఖాళీలు ఉన్నాయి. వీటిలో గతంలో మంజూరైనవి 41, ప్రస్తుతం టీచర్ల పునర్విభజనలో కొత్తగా ప్రతిపాదించినవి 48 ఉన్నాయి. ఈ మొత్తంలో 61 పోస్టుల్లో ఎస్జీటీలకు ఉద్యో గోన్నతి కల్పిస్తారు. మిగిలిన 28 డీఎస్సీ ద్వారా డైరెక్టుగా భర్తీ చేస్తారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లీషు 17, గణితం 18, బయాలజికల్‌ సైన్స్‌ 11, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. సోషల్‌ స్టడీస్‌ ఏడు, తెలుగు ఐదు పోస్టులను కొత్తగా ప్రతిపాదించినప్పటికీ ఇతర స్కూళ్లలో అదేసంఖ్యలో మిగులుగా తేలడంతో వాటిని ఆ స్థానాలకు సర్దుబాటు చేశారు.


షెడ్యూల్‌ ఇదీ..

  • ఈనెల 7న ఉద్యోగోన్నతులకు అర్హులైన ఎస్జీటీలు, ఎస్‌ఏల ప్రాథమిక జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
  • 7, 8 తేదీల్లో ఆ జాబితాపై ఆన్‌లైన్‌లోనే అభ్యంతరాలను సమర్పించవచ్చు
  • 9న ఆర్‌జేడీ, డీఈవోలు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు
  • 10న పదోన్నతుల తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు
  • 11న గ్రేడ్‌-2 హెచ్‌ఎం పోస్టులను అడహక్‌ పదోన్నతుల ద్వారా భర్తీచేసి ఉత్తర్వులు ఇస్తారు
  • 12, 13 తేదీల్లో స్కూలు అసిస్టెంట్‌ పోస్టులకు ప్రభుత్వ, జడ్పీ యాజమాన్యాల వారీగా అడ్‌హక్‌ ఉద్యోగోన్నతు లు ఇస్తారు. 
  • ఆ రెండు రోజు ల్లోనే నియామక ఉత్తర్వులు కూడా జారీచేస్తారు.

Updated Date - 2022-10-06T17:02:31+05:30 IST