రేషన్‌ కార్డులు రద్దయిన వారికి శుభవార్త

ABN , First Publish Date - 2022-08-07T20:44:08+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రేషన్‌కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి.

రేషన్‌ కార్డులు రద్దయిన వారికి శుభవార్త

తిరిగి ఇచ్చేందుకు కసరత్తు

సుప్రీంకోర్టు తీర్పు ఫలితం

కొనసాగుతున్న క్షేత్ర స్థాయి సర్వే

ఆర్థిక స్థితిగతులపై విచారణ

31వేల కార్డులు తిరిగిపొందే అవకాశం


హనుమకొండ (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రేషన్‌కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌ కార్డులు రద్దయిన వారిలో అర్హులుంటే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరు నామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి అర్హులని తేలితే రేషన్‌కార్డులను పునరుద్ధరి స్తారు. రేషన్‌కార్డుల రద్దుకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి పరిశీలన గత నెల 5న ప్రారంభ మైంది. చనిపోయినవారు, ప్రభుత్వ ఉద్యోగుం పొందిన వారు, ఆధార్‌ సంఖ్య రెండుసార్లు నమోదు అయిన వారు, గ్రామంలో లేకుండా పూర్తిగా వెళ్లిపోయినవారు, నిబంధనలకు మించి భూములు కలిగి ఉన్నవారు తది తర కారణాలతో కార్డులను రద్దు చేశారు. అయితే వారి కి ఫలానా కారణంగా రద్దు చేస్తున్నామని ముందుగా నోటీసులు జారీచేయకపోవడంతో ఈపరిస్థితి ఏర్పడింది. 


విచారణ ఇలా..

అర్హులైన వారికి కార్డులు ఇవ్వడానికి ప్రస్తుతం మళ్లీ విచారణ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందుకోసం వారి డేటాను రేషన్‌షాపుల నుంచి సేకరిస్తున్నారు. ఆ జాబి తాలను అన్ని రేషన్‌ షాపులు, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తున్నారు. రద్దయిన కార్డుదారులకు సంబంధించి తనిఖీ అధికారి సంప్రదించలేని, గుర్తించలేని వారికి నోటీసులను వారి చిరునామాకు పోస్టుచేస్తున్నారు. ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదిస్తున్నారు. రీ వెరిఫికేషన్‌పై స్థాని క ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తిరిగి రేషన్‌కార్డు పొందేందుకు అర్హులని తేలి తే వెంటనే ఆ వివరాలను నమోదు చేస్తున్నారు. రద్ద యిన కార్డులకు సంబంధించిన కారణాలను కూడా నమోదు చేస్తున్నారు.


అడ్డగోలుగా రద్దు

రాష్ట్రప్రభుత్వం 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన తర్వాత వివిధ కారణాలు చూపుతూ అంతర్జాలంలో కొన్ని కార్డులను తొలగించి లబ్ధిదారులకు బియ్యం, ఇతర సరుకులను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 39,094 కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు కోల్పోయాయి. ప్రభుత్వం ఎలాం టి నోటీసులు జారీ చేయకుండా కార్డులు తొలగించింద ని ఒక వ్యక్తి దేశ అత్యున్నత న్యాయస్ధానంలో దావా వేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం గతంలో కార్డు లు తొలగించిన వారి కుటుంబ పరిస్థితి పూర్తి స్థాయిలో పరిశీలించి తిరిగి కార్డులు మంజూరు చేయాలని ఆదేశా లు జారీ చేసింది.


39వేల కార్డులు రద్దు

రాష్ట్ర ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి న సమయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 39,094 కుటుంబాలకు నిబంధనలకు మించి ఎక్కువగా  వ్యవసాయ భూమి, నిర్ధారి త పరిమితి కంటే  అధికంగా  ఆదాయం ఉందన్న కారణాలను చూపుతూ లబ్ధిదారు లకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుం డా కార్డులను తొలగించారు. కారు, ద్విచక్ర వాహనం, ఇంట్లో ఏసీ, ఫ్రీజ్‌ వంటివి ఉన్నాయన్న సాకులు సైతం చూపి కూడా తొలగించారు. డాబా ఇల్లు ఉన్నదని కూడా తీసేశారు. హనుమకొండ జిల్లాలో 9,012, వరంగల్‌ జిల్లాలో 8,314, జనగామ జిల్లాలో 6,008, మహబూబాబాద్‌ జిల్లాలో 7,220, ములుగు జిల్లాలో 4,430, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 4,110 ఆహారభద్రత కార్డులను రద్దుచేశారు. అనేక మం ది బాధితులు ఇది అన్యామని విలపిస్తూ తిరిగి కార్డులు మంజూరు చేయాలని పలుమార్లు తహసీల్దార్‌ కార్యాల యంలో వినతి పత్రాలు అందచేజేసినా ఫలితం కూడా లేకుండా పోయింది. గతంలో కార్డులు తొలగించిన వారి కి తిరిగి ఆహార భద్రత కార్డులు మంజూరు చేయాలని న్యాయస్థానం ఉత్త ర్వులు జారీ చేసింది.


కొనసాగుతున్న సర్వే

జిల్లాలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 20,312 కుటుంబాల సర్వే నిర్వహించి వివరాలు అంతర్జాలం లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు పంపించా రు. ఇంకా 18,782 కుటుంబాల ఆర్ధిక పరిస్థితిపై సర్వే నిర్వహించాల్సి ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల చివరి లోపు సర్వే పూర్తిచేసి అర్హత కలిగిన కార్డుదారుల వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తా మని అధికారులు చెబుతున్నారు. రద్దయిన కార్డుల్లో సుమారు 80 శాతం అంటే సుమారు 31,000 రేషన్‌ కార్డులు అర్హమైనవిగా తేలనున్నట్టు తెలుస్తోంది. వీటిని తిరిగి జారీ చేసే అవకాశాలున్న ట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-08-07T20:44:08+05:30 IST