60ఏళ్లు పైబడిన ప్రవాసులకు కువైత్ గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2022-01-31T16:16:56+05:30 IST

60ఏళ్లకు పైబడి, యూనివర్సిటీ డిగ్రీలేని ప్రవాసులకు కువైత్ గుడ్‌న్యూస్ చెప్పింది. వర్క్ పర్మిట్ల రెన్యువల్‌కు సంబంధించి కీలక ప్రటకన వెలువరించింది. యూనివర్సిటీ డిగ్రీలేని 60 ఏళ్లు పైబడిన ప్రవాసులు వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేసుకునేందుకు వీలుగా ఆదివారం గెజిట్ విడుదల చేసింది. దీంతో వర్క్ పర్మిట్లు ..

60ఏళ్లు పైబడిన ప్రవాసులకు కువైత్ గుడ్‌న్యూస్!

ఎన్నారై డెస్క్: 60ఏళ్లకు పైబడి, యూనివర్సిటీ డిగ్రీలేని ప్రవాసులకు కువైత్ గుడ్‌న్యూస్ చెప్పింది. వర్క్ పర్మిట్ల రెన్యువల్‌కు సంబంధించి కీలక ప్రటకన వెలువరించింది. యూనివర్సిటీ డిగ్రీలేని 60 ఏళ్లు పైబడిన ప్రవాసులు వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేసుకునేందుకు వీలుగా ఆదివారం గెజిట్ విడుదల చేసింది. దీంతో వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. ప్రవాసులు వార్షిక రుసుముగా 250 కువైటీ దినార్లు(సుమారు రూ.61వేలు) చెల్లించి, సమగ్ర ఆరోగ్య బీమాను పొందడం ద్వారా పర్మిట్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.



ఇదిలా ఉంటే.. డిగ్రీ పూర్తి చేయని, 60ఏళ్లు దాటిన ప్రవాసులు వర్క్ పర్మిట్ రెన్యువల్‌ చేసుకోవడానికి వీలు లేకుండా కువైత్ కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీంతో  వేలాది మంది ప్రవాసులు ప్రభావితం అయ్యారు. 4వేలకు మందికిపైగా ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోయి వీధినపడ్డారు. దీంతో కువైత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. వర్క్ పర్మిట్ రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఏడాది తర్వాత ఈ గెజిట్‌ను తిరిగి పరిశీలించనున్నట్టు వెల్లడించింది. 




Updated Date - 2022-01-31T16:16:56+05:30 IST