ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు

ABN , First Publish Date - 2020-11-27T05:12:43+05:30 IST

ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్‌ జె.ని వాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం ఇప్పిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదవడం మాకిష్టం అనే కార్యక్రమాన్ని కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు.

ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు

  కలెక్టర్‌ నివాస్‌  

 ‘చదవడం మాకిష్టం’ ప్రారంభం 

గుజరాతీపేట: ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్‌ జె.ని వాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం ఇప్పిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదవడం మాకిష్టం అనే కార్యక్రమాన్ని కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని పవేశపెట్టినట్లు చెప్పారు. చిన్నచిన్న వ్యాఖ్యల నుంచి గ్రంథాల వరకు అనర్గళంగా చదివేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నా రు. కథలు, పత్రికలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, వైజ్ఞానిక విశేషాలతో పాటు అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, సమగ్ర శిక్షా అభియాన్‌ అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ పైడి వెంకటరమణ పాల్గొన్నారు. 


నాడు-నేడు పనుల పరిశీలన..

శ్రీకాకుళం రూరల్‌ మండలం ఇప్పిలి, ఖాజీపేట, కిల్లిపాలెం పాఠశా లల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్‌ నివాస్‌ గురువారం పరిశీలించారు.  పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, మరుగుదొడ్లకు రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఇప్పిలి సచివాలయాన్ని సందర్శించారు. పథకాలు లబ్ధిదారులకు చేరాలని సిబ్బందికి సూచించారు.


Updated Date - 2020-11-27T05:12:43+05:30 IST