హిందుస్థాన్‌ జింక్‌కు గుడ్‌బై

Published: Thu, 26 May 2022 04:36:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హిందుస్థాన్‌ జింక్‌కు గుడ్‌బై

హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌) కంపెనీ ఈక్విటీలో ఉన్న 29.5 వాటాను కూడా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. ఈ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.38,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. వేదాంత గ్రూప్‌ 2002-2003లో హెచ్‌జెడ్‌ఎల్‌ ఈక్విటీలో 44.92 శాతాన్ని ప్రభుత్వం నుంచి, మరో 20 శాతాన్ని ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ 29.5 శాతం వాటా కొనే సంస్థ.. మరో 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. హెచ్‌జెడ్‌ఎల్‌ వాటా విక్రయానికి సంబంధించిన విధివిధానాలను త్వరలో దీపమ్‌ ఖరారు చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.