కామెంట్రీకి చాపెల్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-08-16T12:06:29+05:30 IST

అద్భుతమైన విశ్లేషణలతో కామెంటేటర్‌గా 45 ఏళ్లపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ (78).. కెరీర్‌కు..

కామెంట్రీకి చాపెల్‌ గుడ్‌బై

మెల్‌బోర్న్‌: అద్భుతమైన విశ్లేషణలతో కామెంటేటర్‌గా 45 ఏళ్లపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ (78).. కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2019లో చర్మ కేన్సర్‌ బారినపడిన ఇయాన్‌కు గుండెపోటు కూడా వచ్చింది. ‘కొన్నేళ్ల క్రితం గుండె నొప్పి వచ్చింది. అదృష్టం కొద్దీ బయటపడినా.. జీవితం మాత్రం కష్టంగా మారింది. ప్రయాణాలు చేయాలన్నా, మెట్లు ఎక్కాలన్నా ఎంతో ఇబ్బందిగా మారింద’ని చాపెల్‌ చెప్పాడు. అప్పటి నుంచి మైక్‌ను వీడాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. 1964-80 మధ్య చాపెల్‌ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. 30 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. 16 వన్డేలు కూడా ఆడిన ఇయాన్‌.. క్రికెట్‌ నుంచి వైదొలిగిన తర్వాత కామెంటేటర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. 

Updated Date - 2022-08-16T12:06:29+05:30 IST