AI చాట్‌బాట్ సైంటిస్ట్ అయిందన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. సెలవుపై పంపేసిన గూగుల్

ABN , First Publish Date - 2022-06-14T02:23:16+05:30 IST

గూగుల్ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ సైంటిస్ట్ అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ సంస్థ

AI చాట్‌బాట్ సైంటిస్ట్ అయిందన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. సెలవుపై పంపేసిన గూగుల్

న్యూఢిల్లీ: గూగుల్ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ సైంటిస్ట్ అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్లేక్ లెమోయిన్‌పై గూగుల్ చర్యలు తీసుకుంది. అతడిని పెయిడ్ లీవ్‌పై పంపించింది. ఇటీవల బ్లేక్ మాట్లాడుతూ ఆ ఏఐ చాట్‌బాట్ అచ్చం మనిషిలా ఆలోచిస్తోందని, అలాగే ప్రతిస్పందిస్తోందని పేర్కొన్నారు.  


బ్లేక్‌ను సస్పెండ్ చేసిన గూగుల్.. అతడు కంపెనీ గోప్యతా విధానాన్ని ఉల్లంఘించాడని పేర్కొంటూ పెయిడ్ లీవ్‌పై పంపింది. అతడి ఆరోపణలు ఖండించింది. బేక్ వ్యాఖ్యలను కంపెనీ సమీక్షించిందని, ఈ సందర్భంగా ఆయన వాదనకు బలం చేకూర్చే ఆధారాలేవీ లభ్యం కాలేదని గూగుల్ అధికార ప్రతినిధి బ్రియాన్ గాబ్రెయెల్ పేర్కొన్నారు. లెమోయిన్ అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉన్నారని గాబ్రియెల్ కూడా పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-14T02:23:16+05:30 IST