గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్ యాక్టివ్ చేస్తే.. ప్రమాదాలు, చలాన్‌ల బారినపడరు!

ABN , First Publish Date - 2022-03-08T16:01:53+05:30 IST

గూగుల్ మ్యాప్స్‌ ఒక అద్భుతమైన యాప్.

గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్ యాక్టివ్ చేస్తే.. ప్రమాదాలు, చలాన్‌ల బారినపడరు!

గూగుల్ మ్యాప్స్‌ ఒక అద్భుతమైన యాప్. మనం ఏ ప్రాంతానికికైనా వెళ్లినప్పుడు.. అక్కడ దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటాం. గూగుల్ మ్యాప్స్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. వాటిలో ఒక టూల్ మనల్ని ప్రమాదాల బారి నుంచి రక్షించడమే కాకుండా, చలాన్‌లు పడకుండా కూడా చూస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫీచర్ పేరు ‘గూగుల్ మ్యాప్స్ స్పీడ్ లిమిట్ వార్నింగ్’. ఇది ప్రమాదాలు, చలాన్ల నుండి మనల్ని ఎలా రక్షించగలదో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్ మ్యాప్స్ స్పీడ్ లిమిట్ వార్నింగ్

గూగుల్ మ్యాప్స్‌లో గూగుల్ మ్యాప్స్ స్పీడ్ లిమిట్ వార్నింగ్ ఫీచర్‌.. వాహన వేగాన్ని గుర్తించి వినియోగదారుడిని అప్రమత్తం చేస్తుంది. కొన్నిసార్లు తొందరపాటు వల్ల వేగంగా డ్రైవ్ చేస్తుంటాం. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీనితోపాటు వాహనం వేగం నిర్దేశించిన పరిమితికి మించి ఉంటే ట్రాఫిక్ పోలీసులు చలాన్‌ను విధిస్తారు. కొన్ని సందర్భాల్లో చలాన్ ఇంటికి వచ్చిన తర్వాత తాము అధిక వేగంతో వెళ్లామని తెలుసుకుంటాం. అటువంటి పరిస్థితిలో గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్ వాహన వేగ పరిమితిని దాటిన వెంటనే వినియోగదారుడిని అప్రమత్తం చేస్తుంది.


లేటెస్ట్ వెర్షన్ తప్పనిసరి

గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్ ఉపయోగించడానికి.. గూగుల్ మ్యాప్స్ లేటెస్ట్ వెర్షన్ తప్పనిసరి. మీ స్మార్ట్‌ఫోన్‌లో పాత వెర్షన్‌ ఉన్నట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి దానిని అప్‌డేట్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు ఈ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు.

వేగ పరిమితిని ఎలా సెట్ చేయాలి?

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ని తెరవండి. ఆ తర్వాత కుడివైపున కనిపించే ప్రొఫైల్ చిహ్నంపై నొక్కండి. దీని తర్వాత, సెట్టింగ్‌ల ఎంపికకు వెళ్లి, నావిగేషన్ సెట్టింగ్‌లపై టచ్ చేస్తే.. అక్కడ స్పీడ్ లిమిట్ సెట్టింగ్‌ కనిపిస్తుంది. దానిని ఎంపికచేసి ఆ తర్వాత క్రిందికి స్క్రోల్ చేయండి. అక్కడ  డ్రైవింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్పీడ్ లిమిట్, స్పీడోమీటర్ ఎంపికను ఆన్ చేయాలి. అనంతరం మీరు గూగుల్ మ్యాప్స్ హోమ్‌స్క్రీన్‌కి వెళ్లాలి. ఈ ప్రక్రియ తరువాత మీరు వాహన వేగ పరిమితిని దాటినప్పుడల్లా మీకు గూగుల్ మ్యాప్స్ నుంచి హెచ్చరిక నోటిఫికేషన్ వస్తుంది.



Updated Date - 2022-03-08T16:01:53+05:30 IST