గూగుల్‌ మాస్క్‌!

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

ఓమిక్రాన్‌ విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అప్రమత్తత తీసుకురావడానికి గూగుల్‌ కొత్త ఇన్షియేటివ్‌ తీసుకుంది. గూగుల్‌ లోగోను మాస్క్‌తో తయారు చేసింది. ..

గూగుల్‌ మాస్క్‌!

ఓమిక్రాన్‌ విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అప్రమత్తత తీసుకురావడానికి గూగుల్‌ కొత్త ఇన్షియేటివ్‌ తీసుకుంది. గూగుల్‌ లోగోను మాస్క్‌తో తయారు చేసింది. గూగుల్‌ -  ప్రతి ఇంగ్లీష్‌ అక్షరంపైనా మాస్క్‌ తొడిగి కనిపిస్తుంది. గూగుల్‌ డూడుల్‌ ‘వాక్సిన్‌ వేయించుకోండి, మాస్క్‌ ధరించండి, జీవితాన్ని కాపాడుకోండి’ అంటూ మెసేజ్‌ను యానిమేట్‌ చేసింది.  ప్రతి అక్షరానికి మాస్క్‌కు తోడు పక్కనే మూడు వాక్సిన్‌ బాటిల్స్‌ కూడా కనిపిస్తాయి. గూగుల్‌లో ఇ అనే అక్షరం ఎల్‌ లెటర్‌కు వాక్సినేట్‌ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఫ్లోటింగ్‌ హార్ట్‌కు తోడు వాక్సినేషన్‌ జరిగినట్టు కూడా దర్శనమిస్తుంది. అలాగే పై మెసేజ్‌ను ఫేసుబుక్‌, ట్విటర్‌, మెయిల్‌ ద్వారా షేర్‌ చేసుకునే వెసులుబాటును కూడా గూగుల్‌ కూడా కల్పించింది. అలాగే గూగుల్‌ డూడుల్‌ యూజర్లను మరొక పేజీ మీదకు తీసుకెళుతుంది. పదిహేను సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వాక్సినేషన్‌ చేయించుకోవాలని చూపుతుంది. అదేవిధంగా కొవిన్‌ పోర్టల్‌లోకి వెళ్ళే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. చేరువలో ఉన్న వాక్సినేషన్‌ సెంటర్లను గూగుల్‌ మ్యాప్‌ ద్వారా తెలుపుతుంది. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST