గూగుల్‌ మీట్‌ ఫీచర్స్‌

ABN , First Publish Date - 2022-08-06T05:59:33+05:30 IST

కొవిడ్‌ మహామ్మారి మొత్తం జీవనశైలిని మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. జాబ్‌, స్టడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ సహా అన్ని రంగాలు ఎంతో కొంత మేర ప్రభావితమయ్యాయి. ఆ నేపథ్యంలో మనుషులు ఎంత దూరంలో ఉన్నా..

గూగుల్‌ మీట్‌ ఫీచర్స్‌

కొవిడ్‌ మహామ్మారి మొత్తం జీవనశైలిని మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. జాబ్‌, స్టడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ సహా అన్ని రంగాలు ఎంతో కొంత మేర ప్రభావితమయ్యాయి. ఆ నేపథ్యంలో మనుషులు ఎంత దూరంలో ఉన్నా కలుసుకుని తమ అభిప్రాయాలు కలబోసుకునేందుకు గూగుల్‌ మీట్‌ అత్యంత ప్రధానమైన కమ్యూనికేషన్‌ టూల్‌గా అవతరించింది. డిమాండ్‌ను గుర్తించిన గూగుల్‌ మీట్‌ సైతం అప్డేట్స్‌తో వేదికను సుసంపన్నం చేస్తోంది. యూజర్స్‌ డేటా, అకౌంట్‌ను కాపాడేందుకు తగుచర్యలు తీసుకుంది. వీడియో కాన్ఫరెన్స్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేసింది. దరిమిలా గూగుల్‌ మీట్‌ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవాలంటే...


  • మీట్‌లో పాల్గొన్న వ్యక్తులకు చిన్న గ్రూపులుగా విడిపోయే ఆప్షన్‌ ఉంది. ఫలితంగా చర్చలను మరింత సమర్థంగా నిర్వహించుకునే వెసులుబాటు లభిస్తుంది. వేర్వేరు అభిప్రాయాలను తెలుసుకునే వీలుంది.
  • క్విక్‌ పోల్‌ సదుపాయం ఉంది. ఒక టాపిక్‌పై త్వరితగతిన అందరి అభిప్రాయన్ని తద్వారా తీసుకోవచ్చు. ఆడియన్స్‌ ఫీడ్‌బ్యాక్‌ తీసుకునే సదుపాయం ఎంతో మేలు చేస్తుంది.
  • క్యు అండ్‌ ఎ(క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌) ఫీచర్‌తో ఈ మీట్‌లో పాల్గొనే వ్యక్తులకు ప్రశ్నలు అడిగే అవకాశం లభిస్తుంది. ఒకే టాబ్‌పై ప్రశ్నలన్నీ కనిపిస్తాయి. సమాధానం ఇవ్వడం కూడా సులువుగా ఉంటుంది. 
  • మీటింగ్‌ను రికార్డు చేసుకోవచ్చు. మీట్‌ పూర్తయిన తరవాత షేర్‌ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా విద్యార్థులకు చాలామేలు చేస్తుంది. రికార్డ్‌ చేసిన లెక్చర్స్‌ను తరవాతి రోజుల్లో కూడా చూసే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. అఫ్‌కోర్స్‌ ఇది పెయిడ్‌ ఫీచర్‌. గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఫీచర్‌తో ఇది రూ.672కి ఇండియాలో లభిస్తుంది. 
  • లైవ్‌ క్యాప్షన్స్‌ మరో ఫీచర్‌. ఒక మెంబర్‌ మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తాయి. దీంతో మిగిలిన వారికి విషయం బాగా అర్థమవుతుంది. చర్చ సైతం ఎఫెక్టివ్‌గా ఉంటుంది. 
  • సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను అవసరమైతే ఏదో ఒక విషయమై చేతులు ఎత్తండని అడగవచ్చు. కాల్‌ మధ్యలోనూ ఈ పని చేయవచ్చు. గ్రూప్‌ డిస్కషన్స్‌లో ఇది బాగా ఉపయోగపడుతుంది. చేతులు పైకెత్తిన వ్యవహారం వర్చ్యువల్‌గా పార్టిసిపెంట్‌ వీడియో బాక్స్‌లో కనిపిస్తుంది. 
  • గూగుల్‌ మీట్‌ క్లాస్‌రూమ్‌ ఫీచర్‌ ఉపయోగకరం. ఇది కూడా పెయిడ్‌ ఫీచర్‌. మీటింగ్‌ పూర్తికాగానే అటెండెన్స్‌ రిపోర్టు అందుతుంది.
  • వైట్‌బోర్డ్‌ ఫీచర్‌ మరొకటి. అంటే మీట్‌ నిర్వాహకుడు ఏదైనా రాయడం లేదంటే గీయడం చేయవచ్చు. స్ర్కీన్‌ షేరింగ్‌తో పాల్గొన్న వ్యక్తులు ఆ రాతలు లేదా డ్రా చేసినవి చూడొచ్చు. ఈ స్ర్కిబుల్డ్‌ డాక్యుమెంట్‌ని ఈమెయిల్‌ ద్వారా పార్టిసిపెంట్స్‌ అందరికీ షేర్‌ చేయవచ్చు. 

Updated Date - 2022-08-06T05:59:33+05:30 IST