Google కీలక నిర్ణయం.. అబార్షన్‌ క్లీనిక్‌లకు వెళ్తే..

ABN , First Publish Date - 2022-07-03T02:56:54+05:30 IST

మహిళలకు అబార్షన్ హక్కును దూరం చేస్తూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన నేపథ్యంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Google కీలక నిర్ణయం.. అబార్షన్‌ క్లీనిక్‌లకు వెళ్తే..

ఎన్నారై డెస్క్: మహిళలకు అబార్షన్ హక్కును దూరం చేస్తూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన నేపథ్యంలో గూగుల్(Google) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ క్లీనిక్స్‌, గృహ హింస బాధితుల శరణాలయాలు వంటి గోపత్య అవసరమైన  ప్రదేశాలకు గూగుల్ యూజర్లు వెళ్లిన సందర్భాల్లో వారి లొకేషన్ హిస్టరీని డిలీట్ చేస్తామని ప్రకటించింది. అంతేకాకుండా.. యూజర్ల సమాచారం కావాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తులు సబబుగా అనిపించని పక్షంలో కోరిన సమాచారం ఇవ్వబోమని కూడా పేర్కొంది. అయితే.. ఇది అబార్షన్ సంబంధిత సమాచారానికీ వర్తిస్తుందా లేదా అనేది మాత్రం గూగుల్ వెల్లడించలేదు. 


రాజ్యంగంలో అబార్షన్ హక్కుకు స్థానంలేదంటూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన నేపథ్యంలో రాష్ట్రాలు అబార్షన్ నిరోధక చట్టాలు రూపొందిస్తున్నాయి. అయితే.. చట్టాలను అమలు చేసే క్రమంలో అధికారులు తమ కస్టమర్ల సెర్చ్ హిస్టరీ, లోకేషన్ తదితర వివరాలు అడుతుతారేమోని టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం గూగుల్ ఈ ప్రకటన విడుదల చేసింది. అయితే.. వ్యక్తిగత సమాచారాన్ని సర్వర్ల నుంచి శాశ్వతంగా తొలగిస్తారా లేదా అన్న దానిపై గూగుల్ ప్రతినిధులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

Updated Date - 2022-07-03T02:56:54+05:30 IST