గూగుల్‌ వర్చ్యువల్‌ అసిస్టెంట్‌ దియా

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

పిల్లలకు ఉచ్ఛారణ నైపుణ్యాలు తద్వారా భాష మూలాలను తెలియజేసేందుకు ఉద్దేశించిన గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ యాప్‌ ‘రీడ్‌ ఎలాంగ్‌’. దీనికి సంబంధించిన వెబ్‌ బ్రౌజర్‌ వెర్షన్‌ను

గూగుల్‌ వర్చ్యువల్‌ అసిస్టెంట్‌ దియా

పిల్లలకు ఉచ్ఛారణ నైపుణ్యాలు తద్వారా భాష మూలాలను తెలియజేసేందుకు ఉద్దేశించిన గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ యాప్‌ ‘రీడ్‌ ఎలాంగ్‌’. దీనికి సంబంధించిన వెబ్‌ బ్రౌజర్‌ వెర్షన్‌ను ఇప్పుడు బేటా నుంచి యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఈ విషయంలో పిల్లలకు సహకారం అందించే గూగుల్‌ వర్చ్యువల్‌ అసిస్టెంట్‌ పేరు దియా. ఈ అసిస్టెంట్‌ పిల్లలను గైడ్‌ చేస్తుంది. ఈ వెబ్‌ వెర్షన్‌లో వందల కొద్దీ బొమ్మలతో కూడిన స్టోరీలు ఉన్నాయి. వేర్వేరు రీడింగ్‌ స్థాయులను ఇవి కలిగి ఉన్నాయి. దీన్ని పిల్లలకు ఉపయోగించుకునేందుకు ముందు కథను ఎంపిక చేసుకోవాలి. ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌, మొబైల్‌లో ఒకదానికి మైక్రోఫోన్‌తో అనుసంధానిం చుకుని పెద్ద సౌండ్‌తో కథను చదువు కోవచ్చు. చదివిన పదాలు ఉచ్ఛారణ సరిగ్గా ఉంటే బ్లూ కలర్‌లో కనిపిస్తాయి. తప్పుగా పలికితే సదరు పదం ఎరుపు రంగులో కనిపిస్తుంది. దానిపై పిల్లలు క్లిక్‌ చేయాలి.


కరెక్ట్‌గా ఎలా పలకాలో దియా చెబుతుంది. కథలన్నీ ఇంగ్లీష్‌, తెలుగు సహా పలు భాషల్లో లభిస్తాయి. కొత్తగా చేరిన కథలు ఏడాది చివర్లో ఆండ్రాయిడ్‌, వెబ్‌ వెర్షన్‌లోకి వస్తాయి. యూఎస్‌పీ స్టూడియోలు, చుచు టీవీ నుంచి కంటెంట్‌ను అడాప్ట్‌ చేసుకుంటారు. గూగుల్‌ క్రోమ్‌, మొజిలా ఫైర్‌ఫాక్స్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌కు వెబ్‌ బ్రౌజర్‌ సపోర్టు ఉంది. యాపిల్‌ సఫారీ సహా మిగిలిన వాటికి త్వరలోనే ఈ సహకారం అందుతుంది. 

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST