దివాలా దిశగా Google రష్యన్ వ్యాపారం

ABN , First Publish Date - 2022-05-20T00:52:31+05:30 IST

బ్యాంక్ ఖాతాను ‘రష్యన్ అధికారులు’ స్వాధీనం చేసుకోవడంతో రష్యాలో కార్యకలాపాలు కొనసాగించడం సాధ్యం కాదని గూగుల్ అనుబంధ సంస్థ తెలిపింది.

దివాలా దిశగా Google రష్యన్ వ్యాపారం

లండన్ : బ్యాంక్ ఖాతాను ‘రష్యన్ అధికారులు’ స్వాధీనం చేసుకోవడంతో రష్యాలో కార్యకలాపాలు కొనసాగించడం సాధ్యం కాదని గూగుల్ అనుబంధ సంస్థ తెలిపింది. తమ రష్యన్ అనుబంధ సంస్థ సిబ్బందికి, సరఫరాదారులకు చెల్లింపులు జరపలేనందున దివాలా తీయాలని యోచిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. US టెక్ కంపెనీకి చెందిన రష్యన్ అనుబంధ సంస్థ, Google LLC, జాతీయ రిజిస్ట్రీ అయిన Fedresursకు దివాలా ప్రకటించాలనే ఉద్దేశ్యానికి సంబంధించిన నోటీసును సమర్పించినట్లు రష్యా ప్రభుత్వం బుధవారం నివేదించింది. ‘రష్యన్ అధికారులు గూగుల్ రష్యాకు చెందిన  బ్యాంక్ ఖాతాను స్వాధీనం చేసుకోవడంతో రష్యాకు చెందిన ఉద్యోగులను నియమించడం, చెల్లింపులు జరపడం సహా తమ రష్యా కార్యాలయం పనిచేయడం సాధ్యం కానందున దివాలా కోసం దాఖలు చేశాం’ అని  కంపెనీ ఓ  ప్రకటనలో తెలిపింది. 

Updated Date - 2022-05-20T00:52:31+05:30 IST