ఓటు హక్కు వజ్రాయుధం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-26T05:50:10+05:30 IST

ఓటు హక్కు వజ్రాయుధం : కలెక్టర్‌

ఓటు హక్కు వజ్రాయుధం : కలెక్టర్‌
కలెక్టరేట్‌లో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ గోపి

- జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవం

- పలుచోట్ల ప్రతిజ్ఞలు

వరంగల్‌ కలెక్టరేట్‌, జనవరి 25 : ఓటు వజ్రాయుధమని, ఓటరుగా నమోదు కావడం కర్తవ్యంగా భావించాలని కలెక్టర్‌ గోపి అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఓటు ఆవశ్యకతను వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈనెల 21న జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓటు ప్రాధాన్యంపై నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలెక్టర్‌ ఓటు హక్కు పై ప్రతిజ్ఞ చేయించారు. అదనపు కలెక్టర్లు శ్రీవత్స, హరిసింగ్‌, డీఆర్‌డీవో పీడీ సంపత్‌రావు, డీఈవో వాసంతి, ఏవో విశ్వనారాయణ, ఎన్నికల సూపరిం టెండెంట్‌ జగదీశ్వర్‌, డీటీ సుభాన్‌ పాల్గొన్నారు.

 డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో..

ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని డీఎంహెచ్‌ ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌వో కాజీపేట వెంకటర మణ కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. సూపరింటెండెంట్‌ చంద్రకళ, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌, సీహెచ్‌వో జ్ఞానసుందరి, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ పాలకుర్తి సదానందం, రామలింగయ్య, ఎస్‌ఓ విజయలక్ష్మీ, సీనియర్‌ అసిస్టెంట్లు రాధిక, త్రివేణి, రజనికాంత్‌, వెంకన్న, నితిన్‌, మధు పాల్గొన్నారు.

 సంగెం : ఓటు విలువ తెలుసుకొని, అర్హులైన వారందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని వరంగల్‌ ఆర్డీవో మహేందర్‌జీ పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రతిజ్ఞ చేయించి, మాట్లాడారు. తహసీల్దార్‌ ఎన్‌.రాజేంద్రనాఽథ్‌, డీటీ రాజేశ్వరరావు, ఏఆర్‌ఐ రమేశ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కుంటపల్లి, గవిచర్లలో ఓటర్‌ దినోత్సవాన్ని ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కావాటి వెంకటయ్య,దొనికెల రమాశ్రీనివా్‌స పాల్గొన్నారు.

 నర్సంపేట టౌన్‌ : ఓటుహక్కు ఉన్న ప్రతీ ఒక్కరు తమఓటును వినియోగించుకోవాలని  తహసీల్దార్‌ రామ్మూర్తి అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వేడుకల్లో ఆర్‌ఐ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

వర్ధన్నపేట : మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్‌ పవన్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ హరిత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. 

 ఖానాపురం : బుధరావుపేటలో జరిగిన ఓటరు దినోత్సవంలో ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌ పాల్గొని, అవగాహన కల్పించారు. అనంతరు సీనియర్‌ సిటీజన్‌ యాకుబ్‌అలీని సన్మానించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సుభాషిని ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీటీసీ బిక్కి లింగమ్మమురళి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, రమ పాల్గొన్నారు. 

చెన్నారావుపేట : మండలంతోపాటు, తిమ్మారాయిన్‌ పహాడ్‌లోని జీపీ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయంలో ఓటర్లు దినోత్సవాన్ని నిర్వహించారు. తహసీల్దార్‌ బన్సీలాల్‌ ప్రతిజ్ఞ చేయించారు. 

Updated Date - 2022-01-26T05:50:10+05:30 IST