ఐఓఏ ప్రతినిధులుగా గోపీచంద్‌, జగన్మోహన్‌రావు

ABN , First Publish Date - 2021-05-09T09:28:10+05:30 IST

దేశంలో కరోనా రెండో దశ నేపథ్యంలో మాజీ అథ్లెట్లు, కోచ్‌లను ఆదుకొనే కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌), భారత ఒలింపిక్‌ సంఘం

ఐఓఏ ప్రతినిధులుగా గోపీచంద్‌, జగన్మోహన్‌రావు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దేశంలో కరోనా రెండో దశ నేపథ్యంలో మాజీ అథ్లెట్లు, కోచ్‌లను ఆదుకొనే కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌), భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. ఇందుకోసం తెలంగాణ నుంచి భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం కార్యదర్శి, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఐఓఏ ప్రతినిధులుగా నియమితులయ్యారు. వైద్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ అథ్లెట్లు, కోచ్‌లు www.research.net/r/sai-ioa-covid-19  లింక్‌ను ఓపెన్‌ చేసి తమ వివరాలు నమోదు చేస్తే తగిన సాయం అందజేస్తామని జగన్మోహన్‌రావు తెలిపారు. 

Updated Date - 2021-05-09T09:28:10+05:30 IST