డైరెక్టర్ సెంటిమెంట్... బాలకృష్ణ హీరోయిన్ ఎవరంటే?

May 6 2021 @ 10:20AM

ఈ ఏడాది 'క్రాక్‌'తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం గోపీచంద్‌ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారట. ఇంతకీ దర్శకుడు ఫాలో అవుతున్న సెంటిమెంట్‌ ఏంటో తెలుసా.. శ్రుతి హాసన్‌ను హీరోయిన్‌గా నటింప చేయటం. 'క్రాక్‌'లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఈమెనే బాలకృష్ణ జోడీగా నటింప చేయడానికి గోపీచంద్‌ ఒప్పించడానికి టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫ్యాక్షన్‌ లీడర్‌గా, పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ..బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్స్‌ అవసరం. ఓ హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ను తీసుకున్నారు. మరో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారో చూడాలి. మరి గోపీచంద్‌ ఫాలో అవుతున్న ఈ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే మరి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.