వివరాల్లోకి వెళితే పిప్రాయిచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెమ్చాపర్ గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో వరుడు స్పృహ తప్పిన నేపధ్యంలో పెద్దల మధ్య రెండు గంటలపాటు పంచాయతీ జరిగింది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. హెమ్చాపర్ నివాసి భుఆల్ నిషాద్ ఇంటికి హైదర్గంజ్ నుంచి వరునితోపాటు అతని బంధువులు వచ్చారు. వివాహ వేడుక పూర్తయ్యింది. ఇంతలో వరుడు స్పృహ తప్పి పడిపోయాడు. దీనిని గమనించిన వధువు తరపువారు వరునికి ఏదో వ్యాధి ఉన్నదంటూ పెళ్లని రద్దు చేయాలని పట్టుబట్టారు. రెండు గంటలపాటు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వధువు తరపువారు తాము వరునికి ఇచ్చిన కట్నకానుకలు వెనక్కి తీసుకున్నారు. పెళ్లి క్యాన్సిన్ కావడంతో పెళ్ళికి వచ్చినవారంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.