CM 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి.. TDP నేతలను జైలుకు పంపుతున్నారు: Gorantla

ABN , First Publish Date - 2022-05-12T17:28:53+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు.

CM 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి.. TDP నేతలను జైలుకు పంపుతున్నారు: Gorantla

రాజమండ్రి: ఏపీ ముఖ్యమంత్రి Jaganపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే Gorantla బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ ప్యాక్షన్ నేతని, సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు కాబట్టి.. టీడీపీ నేతలను జైలుకి పంపుతున్నారని అన్నారు. బుద్దిలేని జగన్ మాటలు నమ్మి తప్పులు చేసే అదికారులను వెంటాడతామని ఆయన హెచ్చరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పనికిమాలిన వ్యక్తులతో ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలపై గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్న వైసీపీ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపిచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

Read more