Gorantla video: విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు గోరంట్ల వీడియో టేప్‌లు

Published: Wed, 10 Aug 2022 13:55:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Gorantla video: విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు గోరంట్ల వీడియో టేప్‌లు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla madhav) వీడియో టేప్‌లను పోలీసులు విజయవాడ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (Vijayawada Forensic Science Lab)కు పంపారు. అనంతపురంలో నమోదైన కేసులో ఈ రోజు ఉదయం వీడియో టేప్‌ను విజయవాడ ల్యాబ్‌కు పంపామని ఆఫ్‌ ది రికార్డ్‌గా పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని విజయవాడ ల్యాబ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే అనంతపురం పోలీస్‌ స్టేషన్‌‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు అయ్యింది.


అలాగే మహిళా కమీషన్‌ చైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ(Vasireddy padma) రెండు రోజుల క్రితం డీజీపీ (DGP)కి లేఖ రాశారు. హిందూపురం ఎంపీ మాధవ్ వీడియో టేప్‌‌లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. మహిళా కమీషన్‌ చైర్ పర్సన్‌ రాసిన లేఖపై కూడా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సహజంగా హైదరబాద్‌‌లోని సెంట్రల్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు వీడియో పంపాల్సి ఉంది. అయితే తమకు రాలేదని హైదరాబాద్‌ సెంట్రల్‌ ల్యాబ్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వీడియో టేప్‌ ల్యాబ్‌కు పంపామని నిన్నటి మీడియా సమావేశంలో హోంమంత్రి చెప్పిన విషయం తెలిసిందే. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.