నిధుల కేటాయింపులో వివక్ష

ABN , First Publish Date - 2022-01-29T05:35:04+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 28: నిధుల కేటాయింపులో వివక్షత ప్రదర్శిస్తున్నారంటూ దుర్గాడ ఎంపీటీసీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ పుస్తకాలు ఇవ్వకుండా ఎలా ఆమోదిస్తామని సభ్యులు నిలదీయడంతో గొల్లప్రోలు మండల పరిషత్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాసగా మారి

నిధుల కేటాయింపులో వివక్ష
గొల్లప్రోలులో నిలదీస్తున్న దుర్గాడ ఎంపీటీసీ సభ్యులు

దుర్గాడ ఎంపీటీసీ సభ్యుల తీవ్ర ఆగ్రహం 

రసాభాసగా గొల్లప్రోలు మండల పరిషత్‌ బడ్జెట్‌ సమావేశం

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 28: నిధుల కేటాయింపులో వివక్షత ప్రదర్శిస్తున్నారంటూ దుర్గాడ ఎంపీటీసీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ పుస్తకాలు ఇవ్వకుండా ఎలా ఆమోదిస్తామని సభ్యులు నిలదీయడంతో గొల్లప్రోలు మండల పరిషత్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాసగా మారి ంది. ఒక దశలో వీరు సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. బడ్జెట్‌ సమావేశం గొల్లప్రోలు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ప్రారంభం కాగానే బడ్జెట్‌ ప్రతులను వారంరోజులు ముందుగా ఇవ్వవలసి ఉండగా ఎందుకివ్వలేదని దుర్గాడ-3 ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్‌ ప్రశ్నించారు. దుర్గాడకు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని, తాము ప్రతిపాదించిన పనులు కాకుండా ఇతర పనులకు ఎలా నిధులు పెడతారని దురా ్గడ-2,3 ఎంపీటీసీ సభ్యులు ఆకుల శ్రీను, జ్యోతుల శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే చెప్పినా ఎందుకు నిధులు కేటాయించలేదని నిలదీశారు. ఏ.విజయనగరం గ్రామాన్ని పట్టించుకోవడం లేదని సర్పంచ్‌ కొండబాబురాజు నిరసన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపుపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎంపీడీవో హరిప్రియను ప్రశ్నించారు. అందరితో సంప్రదించి నిధులు కేటాయించాలని సూచించారు. పంక్షనరీ కమిటీల ఏర్పాటుపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు ఎంపీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయేందుకు సిద్ధం కాగా ఎమ్మెల్యే వారికి సర్ధి చెప్పారు. మండల పరిషత్‌కు 2021-22 సంవత్సరానికిగానూ రూ.70 వేల మిగులుతో బడ్జెట్‌ రూపొందించారు. అన్నిమార్గాల ద్వారా రూ.18,06,48,400 వస్తుందని అంచనా వేయగా, వివిధ రూపాల్లో రూ.18,05,78,400 వ్యయమవుతుందని అంచనా వేశారు. జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, వైస్‌ ఎంపీపీలు నేమాని ఆదివిష్ణు, బత్తిన మంగ, తహశీల్దార్‌ అమ్మాజీ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:35:04+05:30 IST