Rajasingh బెయిల్‌పై లాయర్ కరుణ సాగర్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-08-24T02:57:31+05:30 IST

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు (Bail Sanction) అయింది. ..

Rajasingh బెయిల్‌పై లాయర్ కరుణ సాగర్ ఏమన్నారంటే..

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Goshamahal Bjp Mla Rajasingh)కు బెయిల్ మంజూరు (Bail Sanction) అయింది. పోలీసులు 41 సీఆర్‌పీసీ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని.. రిమాండ్‌ను రిజెక్ట్ చేయాలని కోర్టులో రాజాసింగ్ తరపు న్యాయవాది కరణ సాగర్ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. 


దీనిపై లాయర్ కరుణ సాగర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రాజాసింగ్‌కు 41 సీఆర్పీసీ నోటీస్ ఇవ్వకుండా అక్రమ అరెస్టు చేశారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఒక ప్రజాప్రతిని అరెస్టు చేయాలంటే 41 సీఆర్పీసీ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని,  కానీ పోలీసులు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను పాటించకుండా అరెస్టు చేశారని తెలిపారు. తమ వాదనలకు ఏకీభవించి కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. ‘‘ రూ. 20 వేలు సొంత పూచీకత్తులు సమర్పించాలంటూ కోర్టు ఆర్డర్ చేసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మరోసారి వ్యాఖ్యలు చేయవద్దంటూ న్యాయస్థానం సూచన చేసింది. ఇప్పుడు ఆరోపణలు వస్తున్న వీడియోకు సంబంధించి న్యాయస్థానంలో ఎలాంటి వాదనలు జరగలేదు. రాజాసింగ్ మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పటివరకు పోలీసులు కోర్టుకు సమర్పించలేదు. కేవలం రాజాసింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేసేందుకే మా వాదనలు వినిపించాం.’’ అని కరుణ సాగర్ పేర్కొన్నారు. 




Updated Date - 2022-08-24T02:57:31+05:30 IST