Bjp Mla Rajasinghకు 14 రోజుల పాటు రిమాండ్

ABN , First Publish Date - 2022-08-23T23:43:24+05:30 IST

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (goshamahal mla rajasing)కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్....

Bjp Mla Rajasinghకు 14 రోజుల పాటు రిమాండ్

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (goshamahal mla rajasingh)కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియా (rajasingh twitter)లో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్‌కు ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. రాజాసింగ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.  ఈ మేరకు రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 


ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై (BJP Suspends Raja Sing) సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ (BJP) హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది.


అయితే తన సస్పెన్షన్‌ను ఎమ్మెల్యే రాజాసింగ్ ముందే ఊహించారు. మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుని తీరుతామన్న రాజాసింగ్ (rajasingh comments) ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ చెప్పారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్‌ శర్మలా తనను కూడా సస్పెండ్ చేయొచ్చునని అన్నారు. తనను సస్పెండ్ చేసినా ప్రధాని మోదీ, అమిత్‌షాలకు ఫాలోవర్‌గా ఉంటానన్నారు. పార్టీ కంటే.. ధర్మాన్ని కాపాడటమే తనకు ముఖ్యమన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తాయని రాజాసింగ్ ముందే చెప్పారు. 

Updated Date - 2022-08-23T23:43:24+05:30 IST